Sushmita Sen: తనపై వచ్చిన విమర్శలకు స్ట్రాంగ్‌గా బదులిచ్చిన సుస్మితా సేన్

ABN , First Publish Date - 2022-07-18T23:43:22+05:30 IST

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ (Sushmita Sen) ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi) తో డేటింగ్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ విషయం తెలియగానే సెలబ్రిటీలతో సహా, అనేక మంది షాక్ తిన్నారు.

Sushmita Sen: తనపై వచ్చిన విమర్శలకు స్ట్రాంగ్‌గా బదులిచ్చిన సుస్మితా సేన్

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ (Sushmita Sen) ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi) తో డేటింగ్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ విషయం తెలియగానే సెలబ్రిటీలతో సహా అనేక మంది షాక్ తిన్నారు. కొంత మంది సుస్మితను ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ విమర్శించారు. ఈ విమర్శలపై సుస్మిత తాజాగా స్పందించింది. 


తనపై వచ్చిన విమర్శకు స్ట్రాంగ్‌గా బదులిస్తూ సుస్మితా సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన చుట్టూ ఉన్న దయనీయ ప్రపంచాన్ని చూసి మనస్సు ముక్కలైందని సుస్మిత చెప్పింది. ‘‘నాకు పరిచయం లేనివారు, నేను ఎప్పుడు కలవని మిత్రులు నా జీవితంలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది మేధావులు ఫన్నీ గాసిప్స్‌ను ప్రచారం చేస్తున్నారు. నా చుట్టూ ఉన్న దయనీయ ప్రపంచాన్ని చూసి నాకు  చాలా బాధేసింది. నేనొక ‘గోల్డ్ డిగ్గర్’ అని చెబుతున్నారు. నిజానికీ గోల్డ్ కన్నా డైమండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను వాటిని సొంతంగా కొనుక్కోగలను. ఇటువంటి సమయంలోను నాకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులు, స్నేహితులకు ధన్యవాదాలు. మీ సుష్ (సుస్మిత) బాగానే ఉందని దయచేసి తెలుసుకోండి. మీ ఆమోదం, పొగడ్తలపై నేను జీవితాన్ని గడపలేదు’’ అని సుస్మితా సేన్ పోస్ట్ పెట్టింది. అంతకు ముందు ‘లజ్జ’ రచయిత తస్లీమా నస్రీన్ మాజీ విశ్వ సుందరి సుస్మిత మీద సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సుస్మితను తాను ఎంతగానో అభిమానించినట్టు తస్లీమా చెప్పింది. లతిత్ మోదీతో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించడంతో ఆమె మీద గౌరవం కోల్పోయినట్టు తెలిపింది. ‘‘అనేక నేరాలు చేసిన వ్యక్తితో సుస్మిత డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. అతడు చాలా ధనవంతుడు కావడంతోనే ఈ పని చేసిందా? ఆమె డబ్బుకు అమ్ముడు పోయిందా? డబ్బుపై మోజుతో ప్రేమించేవారిపై నేను గౌరవాన్ని వెంటనే కోల్పోతాను’’ అని తస్లీమా నస్రీన్ చెప్పింది. తస్లీమా పోస్ట్ పెట్టిన అనంతరమే సుస్మిత బదులివ్వడం విశేషం. 



Updated Date - 2022-07-18T23:43:22+05:30 IST