Vikram: రోలెక్స్ సర్ ప్రోమో విడుదల.. విలన్‌గా భయపెట్టిన Surya

ABN , First Publish Date - 2022-06-21T18:06:54+05:30 IST

లోకనాయకుడు కమల్ హాసన్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘విక్రమ్’. చాలా ఏళ్ల తర్వాత..

Vikram: రోలెక్స్ సర్ ప్రోమో విడుదల.. విలన్‌గా భయపెట్టిన Surya

లోకనాయకుడు కమల్ హాసన్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘విక్రమ్’. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ఈ తమిళ స్టార్‌కి సక్సెస్‌ని రుచి చూపించింది. జూన్ 3న విడుద‌లైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా.. త‌మిళంలో అయితే ‘బాహుబ‌లి-2’ రికార్డులను బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత క‌మ‌ల్ వెండితెర‌పై క‌నిపించడమే కాకుండా.. ఇలాంటి మాస్ ఎంటర్‌టైనర్‌ని అందించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో నటించగా.. సూర్య ‘రోలెక్స్’గా అతిథి పాత్రలో మెరిశాడు. తాజాగా ఈ మూవీ మేకర్స్ రోలెక్స్ ప్రోమోను విడుద‌ల చేశారు.


ఎంతో పేరున్న నటులు ఉండడంతో విడుదలకి ముందే ‘విక్రమ్’ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల తర్వాత ఆ అంచనాలకు తగ్గట్టుగానే సంచనాలను సృష్టిస్తూ దూసుకుపోతోంది. అందరికంటే ముఖ్యంగా రోలెక్స్ సర్‌ పాత్రలో నటించిన సూర్య ఈ సినిమాకి ఎక్కువ ప్లస్ అయ్యాడని తెలుస్తోంది. ఆయన అభిమానులు చాలామంది సూర్య కోసమే మళ్లీ మళ్లీ సినిమాని చూస్తున్నారు. రోలెక్స్‌గా విలన్ పాత్రలో సూర్య నట విశ్వరూపం చూపించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ఒక్క సీన్‌తో సూర్య గొప్ప న‌టుడని మరోసారి నిరూపించుకున్నాడు. దీంతో పూర్తి స్థాయిలో విలన్‌గా ఆయన్ని ఎప్పుడూ చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన క్యారెక్టర్ ప్రోమోని విడుదల చేసింది చిత్రబృందం. ఆ ప్రోమో ప్రస్తుతం మంచి రెస్పాన్స్ అందుకొంటూ దూసుకుపోతోంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్‌.మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ హాసన్ నిర్మించారు.



Updated Date - 2022-06-21T18:06:54+05:30 IST