Surya: ఆ ఇద్దరి వల్లే గుర్తింపు: సూర్య

ABN , First Publish Date - 2022-08-05T16:51:27+05:30 IST

మా అన్నదమ్ములిద్దరికీ నటులుగా గుర్తింపునిచ్చింది దర్శకులు బాలా (Bala), అమీర్‌ (Amir) అని హీరో సూర్య (Surya) పేర్కొన్నారు. మదురై మట్టి ఎన్నో కథలకు నిలయంగా ఉందని, ముఖ్యంగా కుటుంబ బంధాలపై దర్శకులు సినిమాలు నిర్మించాలని ఆయన కోరారు.

Surya: ఆ ఇద్దరి వల్లే గుర్తింపు: సూర్య

మా అన్నదమ్ములిద్దరికీ నటులుగా గుర్తింపునిచ్చింది దర్శకులు బాలా (Bala), అమీర్‌ (Amir) అని హీరో సూర్య (Surya) పేర్కొన్నారు. మదురై మట్టి ఎన్నో కథలకు నిలయంగా ఉందని, ముఖ్యంగా కుటుంబ బంధాలపై దర్శకులు సినిమాలు నిర్మించాలని ఆయన కోరారు. తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై తన తమ్ముడు కార్తీ (Karthi) హీరోగా, దర్శకుడు శంకర్‌ (Shankar) కుమార్తె అదితి శంకర్‌ (Adithi Shankar) హీరోయిన్‌గా హీరో సూర్య, జ్యోతిక (Jyothika) దంపతులు ‘విరుమన్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక మదురైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భారతీరాజా, శంకర్‌లతో పాటు డీఎంకే ఎంపీ వెంకటేష్‌, 2డి ఎంటర్‌టైన్మెంట్‌ సహ నిర్మాత రాజశేఖర పాండ్యన్‌, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja), చిత్ర బృందం ఆర్‌కె. సురేష్‌, వడివుక్కరసి, సూరి, రోబో శంకర్‌, మైనా నంది, దర్శకుడు ముత్తయ్య తదితరులు హాజరయ్యారు.


హీరోలు సూర్య, కార్తీ  సమక్షంలో ఈ ట్రైలర్‌ను శంకర్‌ విడుదల చేశారు. ఆ తర్వాత చిత్ర బృందంతో పాటు అతిథులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ... ‘మదురై మకుటంగానే కాకుండా, కోలీవుడ్‌లో హిమాలయ శిఖరంగా భారతీరాజా ఉన్నారని, మదురై మట్టి వాసనను వెండితెర ద్వారా చాటారని కొనియాడారు. ఈ మదురై నుంచి భారతీ రాజా తర్వాత ముత్తయ్య రూపంలో మరో ఆణిముత్యం లభించారు. సినిమాల్లోకి కార్తీ కంటే నేను ముందుగా వచ్చినా.. సినిమా గురించి, చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కార్తీ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు’.. అని పేర్కొన్నారు. 


హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘సాధారణ కుటుంబం నుంచి సినిమాల్లోకి రావడం వేరు. శంకర్‌ వంటి స్టార్‌ దర్శకుడు ఫ్యామినీ నుంచి అదితి శంకర్‌ రావడం వేరు. దీనికి కారణం శంకర్‌కు సినిమా పట్ల ఉన్న ప్రేమ. శంకర్‌ నిర్ణయంతో చిత్రపరిశ్రమ పట్ల ఉన్న చెడు భావన తొలగిపోతుంది. మదురై మట్టికి రుణపడివుంటాం. గ్రామీణ కథల్లోని ప్రాముఖ్యత వేరు. అన్నా, తమ్ముడు, అక్క చెల్లి, మామ, మచ్చా ఇలా ఎన్నో బంధాలు మదురై గడ్డపైనే చెప్పగలం. అందుకు ముత్తయ్య వంటి వారు కావాలి. గ్రామీణ కథాంశాలతో అనేక చిత్రాలు రావాలన్నది నా ఆకాంక్ష ఈ చిత్రంలోని ఒక పాత్ర ప్రకాష్‌ రాజ్‌ మాత్రమే చేయగలరు’.. అని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-05T16:51:27+05:30 IST