మళ్ళీ సైంటిస్ట్‌గా Surya ?

ABN , First Publish Date - 2022-07-03T17:25:42+05:30 IST

కోలీవుడ్‌లో ప్రయోగాలకు పెట్టింది పేరు సూర్య (Surya). ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల టాలెంట్ ఆయనది. ఎన్ని పాత్రలు పోషించినా ఇంకా ఏదో చేయాలనే తపన మెండుగా నిండుగా కలిగిన నటుడు.

మళ్ళీ సైంటిస్ట్‌గా Surya ?

కోలీవుడ్‌లో ప్రయోగాలకు పెట్టింది పేరు సూర్య (Surya). ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల టాలెంట్ ఆయనది. ఎన్ని పాత్రలు పోషించినా ఇంకా ఏదో చేయాలనే తపన మెండుగా నిండుగా కలిగిన నటుడు. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్ (Surya son of Krishnan), సెవెంత్ సెన్స్ (Seventh Sense), బ్రదర్స్, 24’ లాంటి ప్రయోగాత్మక సినిమాలు సూర్య టాలెంట్‌కు నిదర్శనాలు. టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందిన ‘24’ చిత్రం లో సైంటిస్ట్ ఆత్రేయ గా నటించిన సూర్య.. మరోసారి సైంటిస్ట్ గా నటించబోతుండడం విశేషం. 


తమిళ దర్వకుడు ఆర్.రవికుమార్ (R.Ravikumar) ఒక విభిన్న తరహా కథను సూర్యకి వినిపించాడట. తన కెరీర్ లోనే ఆ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని అనిపించడంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పూర్తి స్ర్కిప్ట్ పై రవికుమార్ కసరత్తులు చేస్తున్నాడట. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఇటీవల సూర్య నుంచి వచ్చిన ఈటీ (ET) సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమాను తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం బాలా దర్శకత్వంలో సూర్య ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. దీని తర్వాత రవికుమార్ దర్శకత్వంలోని సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని సమాచారం.


ఇటీవల కమల్ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’ (Vikram) సినిమా క్లైమాక్స్‌లో రోలెక్స్ (Rolex) పాత్రలో మెరిసిన సూర్య.. ఆ పాత్రతో సంచలనం రేపాడు. కనిపించింది చాలా తక్కువ సమయమే అయినా.. ఆ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై బలంగా పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సూర్య.. మరింతగా క్రేజీ హీరో అయిపోయారు. మరి సైంటిస్ట్ గా సూర్య.. ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటారో చూడాలి. 

Updated Date - 2022-07-03T17:25:42+05:30 IST