Surya : తన రీమేక్ సినిమాలో తనే క్యామియోగా?

ABN , First Publish Date - 2022-06-15T21:26:13+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. గత చిత్రం ‘ఈటీ’ ఆశించిన రీతిలో ఆడలేదు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ.. కథాంశంలో కొత్తదనం లేకపోవడంతో అన్ని భాషల్లోనూ ఈ సినిమాకి తిరస్కరణ తప్పలేదు.

Surya : తన రీమేక్ సినిమాలో తనే క్యామియోగా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya).. గత చిత్రం ‘ఈటీ’  (ET) ఆశించిన రీతిలో ఆడలేదు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ.. కథాంశంలో కొత్తదనం లేకపోవడంతో అన్ని భాషల్లోనూ ఈ సినిమాకి తిరస్కరణ తప్పలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. సూర్యకి ఈ ఏడాది మరో అద్భుతమైన సినిమాతో సూపర్ క్రేజ్ వచ్చిపడింది. ఆ సినిమా కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘విక్రమ్’ (Vikram).  లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా.. రికార్డు కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా క్లైమాక్స్ లో రోలెక్స్ అనే కరుడుగట్టిన మాఫియా నాయకుడిగా సూర్య కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. అతడు కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. ఆ పాత్రకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 


ఇదిలా ఉంటే.. ‘విక్రమ్’ సినిమాలోని సూర్య క్యామియో రోల్ అద్భుతంగా పేలడంతో.. మరో సినిమాలో కూడా అతడికి క్యామియో ఆఫర్ వచ్చిందని సమాచారం. అయితే ఈ సినిమాకొక ప్రత్యేకత ఉంది. సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ (Surarai potru ) చిత్రం ఓటీటీలో విడుదలై సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇదే సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ (Akasham neehaddura) గా విడుదలైంది. ఇదే సినిమాను అక్షయ్ కుమార్‌ (Akshay Kumar) తో బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara)నే దీనికి కూడా దర్శకురాలు. ఇందులో ఓ ప్రత్యేక క్యామియో రోల్ చేయమని సుధా కొంగర సూర్యని కోరిందట. దీనికి సూర్య అంగీకరించినట్టు సమాచారం. తన రీమేక్ సినిమాలో తనే గెస్ట్ గా కనిపించడం ఒక్క సూర్యకి మాత్రమే చెల్లింది. మరి అందులో సూర్య చేసే పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.   

Updated Date - 2022-06-15T21:26:13+05:30 IST