Chiranjeevi : బర్త్‌డే నిండా సర్‌ప్రైజులే !

ABN , First Publish Date - 2022-08-02T22:48:30+05:30 IST

‘ఆచార్య’ (Acharya) సినిమా ఫలితంతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు ఎంతో నిరాశచెందారు. ఈ కారణంగా చిరు తదుపరి చిత్రాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యహరించనున్నారు. ‘గాడ్ ఫాదర్ (Godfather), భోళాశంకర్ (Bhola Shankar), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)’ చిత్రాల్ని ఇంచుమించు ఒకేసారి పట్టాలెక్కించి.. అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే రీతిలో ఒకదాని తర్వాత ఒకటి విడుదల అయ్యేలా ప్లా్న్ చేస్తున్నారు.

Chiranjeevi : బర్త్‌డే నిండా సర్‌ప్రైజులే !

‘ఆచార్య’ (Acharya) సినిమా ఫలితంతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు ఎంతో నిరాశచెందారు. ఈ కారణంగా చిరు తదుపరి చిత్రాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యహరించనున్నారు. ‘గాడ్ ఫాదర్ (Godfather), భోళాశంకర్ (Bhola Shankar), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)’ చిత్రాల్ని ఇంచుమించు ఒకేసారి పట్టాలెక్కించి.. అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే రీతిలో ఒకదాని తర్వాత ఒకటి విడుదల అయ్యేలా ప్లా్న్ చేస్తున్నారు.  ‘గాడ్‌ఫాదర్’ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగానూ, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి రేసులోనూ దింపుతున్నారు. ‘భోళాశంకర్’ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదే విడుదలచేసే సన్నాహాల్లో ఉన్నట్టు టాక్. అయితే ఈ సినిమాల కన్నా ముందు.. అభిమానులకు మరో పండగ ఎదురవుతోంది. అదే చిరంజీవి పుట్టినరోజు వేడుక. ఈ నెల 22న ఆయన పుట్టినరోజని అందరికీ తెలిసిందే. ఈ పుట్టినరోజును మెగాఫ్యాన్స్ ఎంతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిరు తన బర్త్ డే సందర్భంగా.. అభిమానుల్ని వరుస సర్ ప్రైజులతో ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నట్టు సమాచారం. 


చిరంజీవి నటిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించిన టీజర్స్‌ను అదే రోజు వదలాలని మేకర్స్ భావిస్తున్నారట. దానికి చిరు సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘వాల్తేరు వీరయ్య’. ఇందులో చిరంజీవి దొంగగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే ఇందులో కీలక పాత్ర చేస్తున్న రవితేజ (Raviteja) పోలీసాఫీసర్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. సవతి సోదరులైన చిరు, రవితేజ ..నువ్వా నేనా అన్న రీతిలో తలపడతారట. సినిమాకి అదే హైలైట్ కానున్నదని వినికిడి. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను చిరు బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇక ‘గాడ్‌ఫాదర్’ విషయానికొస్తే ఇటీవల చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ (Salman Khan) లపై తెరకెక్కించిన ప్రత్యేక గీతాన్ని.. చిరు పుట్టినరోజు సందర్బంగానే లిరికల్ సాంగ్‌గా విడుదల చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన ఈ పాట సినిమాకే హైలైట్ కానుందట. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు చేస్తుండగా.. మలయాళ నటుడు బిజు మీనన్ (Biju Menon) విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. 


ఇక ఆగస్ట్ 22నే ‘భోళాశంకర్’ చిత్రానికి సంబంధించిన స్పెషల్ సర్ ప్రైజ్ ఉండబోతోందట. చిరు డైలాగ్స్ తో కూడిన టీజర్ నో లేక, ఆయన సెకండ్ లుక్ పోస్టర్ నో విడుదల చేస్తారని సమాచారం. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’ (Vedalam) కు అఫీషియల్ రీమేక్ అయిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ (Keerthi Suresh) నటిస్తుండగా.. కథానాయికగా తమన్నా (Thamanna) మెప్పించబోతోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్  (Mahathi Swarasagar) సంగీతం అందిస్తున్నాడు. ఇంకా ఇవి కాకుండా.. చిరంజీవి కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా అదే రోజు రానుందని తెలుస్తోంది. మొత్తానికి తన పుట్టినరోజున.. అభిమానులు ఊపిరి సలుపుకోనివ్వలేనంతగా చిరు వరుస సర్ ప్రైజులు ఇవ్వబోతున్నారన్నమాట. 

Updated Date - 2022-08-02T22:48:30+05:30 IST