Vikram స్టార్ Fahadh Faasil పై ప్రశంసలు కురిపించిన Suriya.. ప్రతిసారి ఆశ్చర్యంలో ముంచుతున్నారంటూ..

ABN , First Publish Date - 2022-07-17T19:37:26+05:30 IST

ఇతర భాషల నటులు మరో భాషలో పాపులారిటీ సాధించడం మామూలే. అలా తెలుగు పాపులారిటీ సాధించిన తమిళ నటుడు సూర్య...

Vikram స్టార్ Fahadh Faasil పై ప్రశంసలు కురిపించిన Suriya.. ప్రతిసారి ఆశ్చర్యంలో ముంచుతున్నారంటూ..

ఇతర భాషల నటులు మరో భాషలో పాపులారిటీ సాధించడం మామూలే. అలా తెలుగు పాపులారిటీ సాధించిన తమిళ నటుడు సూర్య (Suriya). అలాగే.. అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘పుష్ప (Pushpa)’ సినిమాతో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) సైతం మంచి పాపులారిటీ సాధించాడు. ఈ ఇద్దరు నటులు లోక నాయకుడు కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’లో కలిసి నటించారు. ఈ మూవీలో వారిద్దరి నటన చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.


ఫహాద్ తాజాగా ‘మలయన్ కుంజు’ అనే మలయాళం మూవీ హీరోగా నటిస్తున్నాడు. ఆ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మూవీ టీం విడుదల చేసింది. అది చూసిన సూర్య, ఫహాద్‌‌ని మెచ్చకుంటూ ఓ ట్వీట్ చేశాడు. అందులో.. ‘ఫాసిల్ సర్‌ అందుకొండి నా ప్రేమ, గౌరవం! ఫహద్ మీ కథలతో నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తారు..! నిజంగా ఇలాంటి భిన్నమైన ఈ ప్రయత్నానికి సంబంధించిన ఫుటేజీ చూసి ఆశ్చర్యపోయాను..! సాజిమోన్ ప్రభాకర్,  మహేష్ నారాయణన్, రజిషా విజయన్‌తో పాటు మూవీ టీంకి ఆల్ ద బెస్ట్’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పలువురు సూర్య ఫహాద్ అభిమానులు ఈ నటులను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.


కాగా.. సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో ఓ సినిమా, మేరీ సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాంతోపాటు కార్తీ హీరోగా ‘విరుమన్’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఫహాద్ సైతం ‘మలయన్ కుంజు’తోపాటు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప 2’లో విలన్‌గా నటిస్తున్నాడు.















Updated Date - 2022-07-17T19:37:26+05:30 IST