Suriya-Siva Combo: యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌లో భారీ చిత్రం

ABN , First Publish Date - 2022-08-25T01:07:01+05:30 IST

విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, మార్కెట్‌‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య (Suriya).. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా

Suriya-Siva Combo: యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌లో భారీ చిత్రం

విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, మార్కెట్‌‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వర్సటైల్ స్టార్ సూర్య (Suriya).. మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన శివ (Siva) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విశేషమేమిటంటే.. ఈ చిత్రాన్ని టాలీవుడ్, కోలీవుడ్‌లో అగ్ర బ్యానర్లుగా పేరున్న నిర్మాణ సంస్థలు నిర్మిస్తుండటం. టాలీవుడ్‌కి చెందిన యువీ క్రియేషన్స్ (UV Creations), కోలీవుడ్‌కి చెందిన స్టూడియో గ్రీన్‌ (Studio Green)తో కలిసి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. 


మొదటి నుంచి కమర్షియల్‌తో పాటు వినూత్నమైన కథలతో.. మంచి విజయాలను సొంతం చేసుకున్న యువీ క్రియేషన్స్ సంస్థ.. ‘సాహో’ (Sahoo), ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) వంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్‌లో సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్‌లో.. స్టూడియో గ్రీన్‌తో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. బుధవారం ఈ సినిమా షూటింగ్ చిత్ర యూనిట్‌తో పాటు అతిరథ మహారధుల సమక్షంలో మొదలైంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఇతర వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

Updated Date - 2022-08-25T01:07:01+05:30 IST