Suriya : తమిళ చిత్రానికి 13 ఏళ్ల తర్వాత.. అందుకే ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-10-01T17:30:58+05:30 IST

దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న మధుర క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను’’ అని తమిళ హీరో సూర్య అన్నారు.

Suriya : తమిళ చిత్రానికి 13 ఏళ్ల తర్వాత.. అందుకే ప్రత్యేకం!

దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ నటుడిగా  జాతీయ పురస్కారం (68th National awards)అందుకున్న మధుర క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను’’ అని తమిళ హీరో (Suriya)సూర్య అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సూర్య మీడియాతో మాట్లాడారు. ‘‘సురారై పోట్రు’ (soorarai pottru)(తెలుగులో ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నా.  భారత ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. ఈ మధుర క్షణాలను (Sweet Memories)అనుభవించడం వెనుక చాలామంది ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. ముఖ్యంగా నా దర్శకురాలు సుధా కొంగర కరోనా కష్టాల్ని సైతం అధిగమించి సినిమా పూర్తి చేశారు. మా అందరిలో ధైర్యాన్ని నింపారు. సుధా (Sudha kongara)పదేళ్ల కష్టం ఈ సినిమా. జాతీయ అవార్డుతో మా ప్రయాణం సఫలమైంది. ఈ చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంతకు మించిన గౌరవం, ఆనందం ఇంకేం ఉంటుంది. ఈ అవార్డు మాకెంతో ప్రత్యేకం. ఉత్తమ చిత్రంగా ఒక తమిళ చిత్రం జాతీయ పురస్కారానికి ఎంపికై సుమారు 13 ఏళ్లు అవుతోంది.  మా సినిమాతో మళ్లీ ఆ వైభవం వచ్చింది. నా జర్నీలో కీలక పాత్ర పోషించే నా భార్య జ్యోతికకు రుణపడి ఉంటా. నా కంటే ముందు తానే ఈ సినిమాపై నమ్మకం పెట్టుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోవడం చూసి మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించా’’ అని సూర్య అన్నారు.


దర్శకురాలు సుధా కొంగర కూడా అవార్డు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భూమి నుంచి ఆకాశం వరకూ నా ప్రియమైన వారందరికీ కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఎయిర్‌ డెక్కన్‌ సంస్థ అధినేత కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఇతివృత్తగా రూపొందిన చిత్రమిది.  ఉత్తమ చిత్రం, ఉత్తమ స్ర్కీన్‌ ప్లే, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కేటగిరీల్లో ఈ చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వరించాయి. 


Updated Date - 2022-10-01T17:30:58+05:30 IST