Suriya Birthday: సూర్యకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో మీకు తెలుసా..?

ABN , First Publish Date - 2022-07-24T00:21:52+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషించే నటుడు సూర్య (Suriya). ‘గజినీ’, ‘సింగం’, ‘బ్రదర్స్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. 68వ జాతీయ చలన చిత్ర

Suriya Birthday: సూర్యకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో మీకు తెలుసా..?

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషించే నటుడు సూర్య (Suriya). ‘గజినీ’ (Ghajini), ‘సింగం’ (Singam), ‘బ్రదర్స్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘సూరారై పోట్రు’ కు ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. అతడు జులై 23న 47వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అతడి జీవితంపై ఓ లుక్కేద్దామా.. 


ఫోర్బ్స్ లెక్కల ప్రకారం సూర్య ఆస్తి, పాస్తుల విలువ రూ. 186కోట్లు. దక్షిణాదిలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో అతడు కూడా ఒకరు. సూర్య నెలకు రూ. 1. 5కోట్లు సంపాదిస్తాడని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఒక్కో సినిమాలో నటించేందుకు రూ. 20కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటాడని సమాచారం. బ్రాండ్‌కు ప్రచారం చేయడానికి రూ.2కోట్లను పారితోషికంగా అందుకుంటాడట. ప్రమోషన్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, టీవీ కమర్షియల్స్ వంటి వివిధ మార్గాల్లో ఏడాదికి రూ. 30కోట్ల వరకు సంపాదిస్తాడని టాక్. 


సూర్యకు కార్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తన గ్యారేజీలో అనేక విలాసవంతమైన కార్లకు చోటిచ్చాడు. బీఎమ్ డబ్ల్యూ-7 సిరీస్, ఆడి-క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ ఎమ్ క్లాస్, జాగ్వార్ ఎక్స్‌జేఎల్ వంటి కార్లను సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో చెన్నైలో పుట్టి పెరిగాడు. కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించాడు. లయోలా కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 1997లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘నందా’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ జ్యోతిక‌ను 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్య సోదరుడు కార్తి కూడా సినిమా రంగంలోనే రాణిస్తున్నాడు.

Updated Date - 2022-07-24T00:21:52+05:30 IST