ఈ ఫొటోలోని పిల్లలు ఇద్దరూ.. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు యమా ఫేమస్.. ఎవరో గుర్తు పట్టగలరా..?

ABN , First Publish Date - 2022-09-07T19:16:17+05:30 IST

పైన ఉన్న ఫొటోని ఓసారి చూడండి.. అందులో ఉన్న పిల్లలని ఎక్కడైనా చూసినట్టు ఉందేమో గుర్తు తెచ్చుకోండి...

ఈ ఫొటోలోని పిల్లలు ఇద్దరూ.. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు యమా ఫేమస్.. ఎవరో గుర్తు పట్టగలరా..?

పైన ఉన్న ఫొటోని ఓసారి చూడండి.. అందులో ఉన్న పిల్లలని ఎక్కడైనా చూసినట్టు ఉందేమో గుర్తు తెచ్చుకోండి. గుర్తు పట్టలేకపోతున్నారా. అయితే క్లూ ఇస్తాం. ఆ ఇద్దరూ పిల్లలు సొంత అన్నదమ్ములు. అంతేకాదు.. వారిద్దరూ తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో మంచి నటులు. ఆ ఇద్దరికీ కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికైనా గుర్తొచ్చిందా?.. అవును.. మీరు ఊహించేది కరేక్టే.


ఆ అన్నదమ్ములు సూర్య(suriya), కార్తీ(karthi). ఈ సోదరుల తండ్రి శివకుమార్ సినీ రంగానికే చెందిన వ్యక్తి కావడంతో.. చిన్నప్పటి నుంచి కుమారులకి సంబంధించి ప్రతి విషయాన్ని చాలా అపురూపంగా ఫొటో తీసేవారు. ముఖ్యంగా వారిలో పెద్దవాడైనా సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చెన్నైలో డిగ్రీ పూర్తి చేసిన సూర్య. అనంతరం డబ్బుల కోసం రోజుకి దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓ ఉద్యోగం చేసేవాడు. అనంతరం 1997లో సినిమాల్లోకి ప్రవేశించి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్‌గా, నటుడిగా తనకంటూ గుర్తింపు పొందాడు. ఆయన సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి సెప్టెంబర్ 6కి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సోదరులకి సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరోవైపు.. ఫారెన్‌లో ఇంజీనీరింగ్ చదివి.. సినిమాల మీద ప్రేమతో డైరెక్టర్ అవుదామనకున్నాడు కార్తీ. దాని కోసం డైరెక్టర్ మణిరత్నం దగ్గర ఓ సినిమా కోసం అసిస్టెంట్‌గా చేరాడు. అనంతరం పలువురు సూచన మేరకు 2007లో వచ్చిన పరుత్తివీరన్‌తో హీరోగా మారి వరుసగా సూపర్ హిట్స్‌తో స్టార్‌గా ఎదిగాడు.


ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. ఈ ఇద్దరూ సోదరులు మొదటిసారి కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. అది కూడా తమ్ముడు కార్తీ హీరోగా.. అన్న సూర్య విలన్‌గా. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ క్రియేట్ చేసిన.. ఖైదీ, విక్రమ్ సినిమాల మల్టీవర్స్‌లలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. దాంతో వారి ఫ్యాన్స్ ఆ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరూ అన్నదమ్ములను దర్శకుడు లోకేష్ కనకరాజ్  ఏ లెవల్‌లో  చూపించబోతున్నారు..?. వీరితో కలిసి కమల్ చేయబోయే నటవిశ్వరూపం ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాలి.

Updated Date - 2022-09-07T19:16:17+05:30 IST