గ్యాంగ్‌స్టర్ కథతో ‘సిన్స్ 1975’: ‘కెజియఫ్’ని తలపిస్తోన్న పోస్టర్

ABN , First Publish Date - 2022-07-17T02:15:48+05:30 IST

ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సిన్స్ 1975’ (Since 1975). అభిలాష్, రోహి నయన్ హీరోహీరోయిన్లుగా.. అఆ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. సురేంద్ర మాదారపు

గ్యాంగ్‌స్టర్ కథతో ‘సిన్స్ 1975’: ‘కెజియఫ్’ని తలపిస్తోన్న పోస్టర్

ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సిన్స్ 1975’ (Since 1975). అభిలాష్, రోహి నయన్ హీరోహీరోయిన్లుగా.. అఆ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. సురేంద్ర మాదారపు (Surendra Madarapu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌ని గమనిస్తే.. ఇటీవల సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘కెజియఫ్’‌(KGF)ను తలపిస్తుండటం విశేషం. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. 


ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన బెల్లాన అప్పారావు మాట్లాడుతూ.. ‘‘ఒకప్పటి టాప్ గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా దర్శకుడు సురేంద్ర ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తవడమే కాకుండా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకి చేరుకున్నాయి. ప్రస్తుతం చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశాం. ఈ పోస్టర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం..’’ అని తెలిపారు. చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. ‘‘రస్టిక్ గ్యాంగ్‌స్టర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించాము. రియలిస్టిక్ అప్రోచ్ కోసం అంతా కొత్తవారితోనే ఈ చిత్రం చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలా వరకు థియేటర్ ఆర్టిస్ట్‌లనే తీసుకున్నాం. అందరూ అద్భుతమైన నటనను కనబరిచారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్‌కు, ఎడిటర్ ప్రవీణ్ పూడికి, ఇతర సాంకేతిక నిపుణులకు, నిర్మాతకు ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.



Updated Date - 2022-07-17T02:15:48+05:30 IST