అతనితో ఫ్రెండ్షిప్.. ఇతనితో ప్రేమ..: సురేఖా వాణి కూతురు సుప్రీత

ABN , First Publish Date - 2022-01-21T01:06:19+05:30 IST

‘‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి స్నేహితుడు ఒకడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి..

అతనితో ఫ్రెండ్షిప్.. ఇతనితో ప్రేమ..: సురేఖా వాణి కూతురు సుప్రీత

‘‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి స్నేహితుడు ఒకడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్‌ ఫ్రెండ్స్‌’’.. ఇది రెండు రోజుల క్రితం నందు అనే కుర్రాడి గురించి నటి సురేఖా వాణి కూతురు సుప్రీత చెప్పిన సమాధానం. ఇప్పుడు మరో యువకుడితో క్లోజ్‌గా ఉన్న ఫొటో పెట్టి.. ‘యస్ చెప్పేశా.. ’ అంటూ లవ్ సింబల్‌ని తన ఇన్‌స్టాగ్రమ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియా అంతా సుప్రీత ప్రేమలో ఉందని, త్వరలోనే సురేఖా వాణికి అల్లుడు రాబోతున్నాడంటూ వార్తలు మొదలయ్యాయి.


సేమ్ టు సేమ్ దగ్గుబాటి రానా కూడా అప్పట్లో ఇలాగే సడెన్‌గా.. తన ప్రియురాలు మిహీకను పరిచయం చేశారు. ఇప్పుడు అతని దారిలోనే సుప్రీత కూడా తనకు కాబోయే వాడిపై పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన పిక్‌లో ఉన్న యువకుడి పేరు రాకీ జోర్డాన్‌ అని తెలుస్తుంది. అతను కూడా ‘సుప్రీత యస్ చెప్పింది’ అంటూ ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. అయితే అతను నటుడు, ర్యాపర్‌ అనేది అతని ప్రొఫైల్ చూస్తుంటే తెలుస్తోంది. దీనిని బట్టి వీరిది నిజమైన ప్రేమేనా? లేక ఏదైనా వీడియో ప్రొమోషన్ కోసం ఇలా చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కొందరు ఇటువంటి జిమ్మిక్సే ప్లే చేస్తున్నారు. దీనిపై సురేఖా వాణి కూడా రియాక్ట్ అయితే గానీ ఏ విషయం తెలియదు. అప్పటి వరకు ఈ జంట గురించి ఇలా వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.







Updated Date - 2022-01-21T01:06:19+05:30 IST