జపాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో Surya చిత్రానికి అవార్డులు

Twitter IconWatsapp IconFacebook Icon

హీరో సూర్య (Surya) - మహిళా దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara) కాంబినేషన్‌లో వచ్చిన ‘సూరరైపోట్రు’ (Surarai potru ) చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ (Akasham nee Haddura) గా విడుదలై.. ఇక్కడ కూడా అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా అనేక అంతర్జాయ చిత్రోత్సవాల్లో పలు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలో తాజాగా జపాన్‌ లో జరిగిన ఒసాకా తమిళ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Osaka Tamil International Film Festival) లో ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.


ఉత్తమ నటుడిగా సూర్య (Surya), ఉత్తమ దర్శకురాలిగా సుధా కొంగర (Sudha Kongara), ఉత్తమ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ (Gv Prakash)‌, 2020 సంవత్సరానికి బెస్ట్‌ మూవీగా ‘సూరరైపోట్రు’ (Surarai potru) ఉత్తమ నిర్మాణ సంస్థగా 2డి ఎంటర్‌టైన్మెంట్ (2D Entertainment)‌, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టరుగా జాకీ (Jokey) అవార్డులను గెలుచుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మల్లూ బ్యూటీ అపర్ణ బాలమురళి (Aparna Balamurali) నటించగా, 2020లో అమెజాన్‌  ప్రైమ్‌ (Aamazon Prime) ఓటీటీలో విడుదలైంది. డెక్కన్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా చక్కటి భావోద్వేగాలతో తెరకెక్కింది. మరి ఈ సినిమాకి ఇంకెన్నీ అవార్డులు వస్తాయో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.