Rajanikanth Comments: యోగాతోనే ప్రశాంతత

ABN , First Publish Date - 2022-07-23T17:00:56+05:30 IST

యోగాతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని, తాను నటించిన చిత్రాల్లో ‘బాబా’, ‘శ్రీ రాఘవేంద్ర’ సినిమాలు తనకు ఆత్మ సంతృప్తినిచ్చాయని తమిళ సూపర్ స్టార్

Rajanikanth Comments: యోగాతోనే ప్రశాంతత

- ‘బాబా’, ‘శ్రీ రాఘవేంద్ర’ చిత్రాలు ఆత్మతృప్తినిచ్చాయి

- సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌


ప్యారీస్‌(చెన్నై), జూలై 22: యోగాతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని, తాను నటించిన చిత్రాల్లో ‘బాబా’, ‘శ్రీ రాఘవేంద్ర’ సినిమాలు తనకు ఆత్మ సంతృప్తినిచ్చాయని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajanikanth) తెలిపారు. నుంగంబాక్కంలోని ప్రయివేటు కల్యాణమండపంలో శుక్రవారం సాయంత్రం యోగద సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘క్రియ యోగా ద్వారా సంతోషకరమైన జీవితం’ అనే అంశంపై సొసైటీ సీనియర్‌ స్వామి సుద్దానంద గిరి తమిళ ఉపన్యాస కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ప్రముఖ నటుడు, పద్మభూషణ్‌ పాల్గొని యోగాభ్యాసంపై తమిళంలో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాద సత్సంగ సొసైటీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయన్నారు. స్వామి సుద్దానందగిరి చిన్ననాటి నుంచే యోగాపై మమకారం పెంచుకొని, తాను నేర్చుకున్న విద్యను ప్రజలకందించడం ప్రశంసనీయమన్నారు. తాను నటించిన బాబా చిత్రం (Baba Flim) చూసి చాలా మంది యోగద సత్సంగ సొసైటీలో సభ్యులుగా చేరారని, ముఖ్యంగా తన ఇద్దరు అభిమానులు ప్రస్తుతం ఈ సంస్థలో సన్యాసులుగా ఉండడం మహానందంగా ఉందని రజనీకాంత్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వామి సిద్దానందగిరి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాభాస్యంలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సూచనలిచ్చారు.

Updated Date - 2022-07-23T17:00:56+05:30 IST