
మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand), విలక్షణ దర్శకుడు మారుతి (Maruthi) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commerical). మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures) - యూవీ క్రియేషన్స్ (UV Creations) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు (Bunny Vas) నిర్మాత. SKN సహ నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా (Rashi Khanna) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 1 జూలై, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ మ్యూజికల్ ప్రొమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌తో పాటు, దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) రచించిన టైటిల్ సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ లిరికల్‌ను నిర్మాతలు విడుదల చేశారు. రాశీ ఖన్నాని అందాల రాశి (AndalaRaasi)గా అభివర్ణిస్తూ గోపీచంద్ పాడుకున్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకు జకేస్ బీజాయ్ (Jakes Bejoy) స్వరాలు సమకూర్చారు. కృష్ణకాంత్ (KK) సాహిత్యం అందించిన ఈ పాటను సాయిచరణ్ భాస్కరుణి (Saicharan Bhaskaruni), రమ్యా బెహ్రా (Ramya Behara) ఆలపించారు. విడుదలైన కాసేపటికే ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ.. శ్రోతల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
ఈ పాట సాహిత్యాన్ని పరిశీలిస్తే..
అందాల రాశి మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే..
నరనావకీలా పని నేర్పుతారా.. నను చేర్చుకోరా రెడీగా ఉన్నా రా..
ఫీ వద్దులేరా.. ఫేమస్సు కారా.. ఇక నా సేవ చేసేసుకో..
ఆగేటట్టుందే.. నా గుండె హిప్సే చూస్తుంటే..
ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.. (2)
అందాల రాశి మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
బుల్లితెర నేనే.. బిగ్ స్టారును నేనే..
తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే..
అన్నీ వదిలి వచ్చేసాను పోస్టే ఇచ్చుకో..
మోమాటాలు ఏవీ లేక ఫాలో చేసుకో..
మా బాగుందే నీ పేరు సూపర్ కుదిరిందే..
బ్లాక్ అండ్ వైట్ హాలుకు మొత్తం కలరింగ్ వచ్చిందే..
నా కండీషన్స్ అన్నీ నీకిష్టమైతే ఇక వచ్చేయ్ లేటెందుకే..
కాంబో కుదిరిందే.. మనిద్దరి కాంబో కుదిరిందే..
ఎండే లేని సీరియళ్లా వందేళ్లుండాలే.. (2)
అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే..
ఆగేటట్టుందే.. నా గుండె హిప్సే చూస్తుంటే..
ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.. (2).. అంటూ ఈ పాట సాగింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. గోపీచంద్, రాశీ ఖన్నాల జంట కూడా ఈ పాటలో చాలా చక్కగా ఉంది.