పలు భాషల్లో ఉచితంగా సన్నీలియోన్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2022-03-01T23:30:13+05:30 IST

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను క్రేజ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్

పలు భాషల్లో ఉచితంగా సన్నీలియోన్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను క్రేజ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్. ‘కరెంటు తీగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. సన్నీ చివరగా 2019లో విడుదలైన హిందీ చిత్రం ‘మోతీ‌చూర్ చక్నాచూర్’ లో ఓ అతిథి పాత్రలో మెరిసింది. కరోనా విలయతాండవం చేయడంతో ఏ చిత్రంలో నటించలేదు. తాజాగా ఆమె ‘అనామిక’ వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ‘ఏజెంట్ ఏంను కలుసుకోండి’’ అని రాసింది. 


‘అనామిక’ వెబ్ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ షోలో ఆమె  స్పై పాత్రను పోషించింది. విక్రమ్ భట్ తెరకెక్కించాడు. ‘ఎమ్‌ఎక్స్ ప్లేయర్’ లో ఈ షో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ఉచితంగా తెలుగు, తమిళ్, కన్నడ మలయాళం, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లో అందరికి అందుబాటులో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ గురించి సన్నీ లియోన్ మీడియాతో మాట్లాడింది. ‘‘నేను యాక్షన్ ఎంటర్ టైనర్లల్లో ఇప్పటి వరకు నటించలేదు. ‘అనామిక’ స్ర్రిఫ్ట్ చదవగానే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ షోలో నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. విక్రమ్ భట్ దర్శకత్వంలో ఉత్సాహంగా నటించాను. నా పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకోవడం మంచి అనుభూతినిచ్చింది. ఈ సిరీస్‌ను చూసి ప్రేక్షకుల ఏలా స్పందిస్తారో చూడాలి’’ అని సన్నీ లియోన్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్‌లో సమీర్ సోనీ, రాహుల్ దేవ్, అయాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.




Updated Date - 2022-03-01T23:30:13+05:30 IST