సన్నీ లియోన్ పెళ్లి... 11 ఏళ్ల నాటి ‘wedding envelopes’ గుర్తు చేసుకున్న మిసెస్ వెబర్!

ABN , First Publish Date - 2022-04-10T03:17:20+05:30 IST

సన్నీ లియోన్ తన పెళ్లి నాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకుంది. 11 ఏళ్ల కిందటి వెడ్డింగ్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగిన ఆనాటి వేడుకలో ఆమె డేనియల్ వెబర్‌తో ఏడు అడుగులు వేసింది. గత పదకొండేళ్లుగా వారిద్దరూ విజయవంతంగా సంసార సాగరాన్ని ఈదేస్తున్నారు. అయితే, దశాబ్దం కిందట పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న తన ఆర్దిక పరిస్థితేంటో సన్నీ నెటిజన్స్‌కు చెప్పుకొచ్చింది...

సన్నీ లియోన్ పెళ్లి... 11 ఏళ్ల నాటి ‘wedding envelopes’ గుర్తు చేసుకున్న మిసెస్ వెబర్!

సన్నీ లియోన్ తన పెళ్లి నాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకుంది. 11 ఏళ్ల కిందటి వెడ్డింగ్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగిన ఆనాటి వేడుకలో ఆమె డేనియల్ వెబర్‌తో ఏడు అడుగులు వేసింది. గత పదకొండేళ్లుగా వారిద్దరూ విజయవంతంగా సంసార సాగరాన్ని ఈదేస్తున్నారు. అయితే, దశాబ్దం కిందట పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న తన ఆర్దిక పరిస్థితేంటో సన్నీ నెటిజన్స్‌కు చెప్పుకొచ్చింది... 


11 ఏళ్ల కిందట తమ పెళ్లి సమయంలో చేతిలో డబ్బుల్లేవని జ్ఞాపకం చేసుకుంది సన్నీ. వివాహ వేడుకకి ఆహ్వానించింది కూడా కేవలం 50 మందిని మాత్రమేనట. అయితే, అలా వచ్చిన అతిథులు అందజేసిన వెడ్డింగ్ ఎన్‌వలప్స్ కూడా కొత్త దంపతులు చకచకా తెరిచేశారట. ఎందుకంటే, ఆ గిఫ్ట్ కవర్స్‌లో బహుమతిగా వచ్చిన డబ్బులతోనే రిసిప్షన్ బిల్స్ చెల్లించాల్సి వచ్చిందట! డబ్బులకి అంతగా కటకట ఉండేదట అప్పట్లో! 


భారతీయ మూలాలున్న కెనడియన్ సిటీజన్ అయిన సన్నీ లియోన్ మొదట్లో పోర్న్ స్టార్‌గా నీలి చిత్రాలు చేసింది. అయితే, ఆ రంగం వద్దనుకున్న ఆమె ఏటికి ఎదురీదుతూ మెయిన్‌స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్‌లోకి వచ్చింది. ముంబైలో కాలుపెట్టి బాలీవుడ్‌లో ఛమక్కున మెరిసింది. తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ తన అందాలతో ఆహా అనిపిస్తోంది. 11 ఏళ్ల కిందట పెళ్లి పీటలపై డబ్బుల్లేక ఇబ్బంది పడ్డ మిసెస్ సన్నీ ప్రస్తుతం లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ముగ్గురు పిల్లలు, భర్తతో సహా ముంబైలో స్వంత ఇల్లు కొనుక్కుని సెటిలైంది! అందుకే, ఆమె ‘మేం చాలా దూరం వచ్చాం...’ అంది తన ఇన్‌స్టా పోస్టులో...  

Updated Date - 2022-04-10T03:17:20+05:30 IST