ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంది.. సమయం సరిపోవట్లేదు: Sunny Leone

ABN , First Publish Date - 2022-03-14T16:03:46+05:30 IST

సన్నీ లియోన్.. దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని యువత లేదంటే అతిశయోక్తి కాదు. ఈ బ్యూటీ కెనడాలో అడల్ట్ చిత్రాలతో గుర్తింపు పొంది..

ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంది.. సమయం సరిపోవట్లేదు: Sunny Leone

సన్నీ లియోన్.. దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని యువత లేదంటే అతిశయోక్తి కాదు. ఈ బ్యూటీ కెనడాలో అడల్ట్ చిత్రాలతో గుర్తింపు పొంది.. అనంతరం బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా మంచి కథలను ఎంచుకుంటూ బీ టౌన్‌లోనూ గుర్తింపు సాధించింది. ఈ భామ తాజాగా నటించిన వెబ్‌‌సిరీస్ ‘అనామిక’ ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ షో ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకుంది.


సన్నీ మాట్లాడుతూ.. ‘తల్లిగా పిల్లలను చూసుకోవడం, నటిగా కెరీర్ మీద దృష్టి పెట్టడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పిల్లలకు సంబంధించి డైలీ రోటీన్‌ని దగ్గరుండి చూడాలనుకునే తల్లుల్లో నేనూ ఉంటాను. కరోనా పాండమిక్ కారణంగా గత రెండు సంవత్సరాలు వారితో ఎంతో సమయం గడిపాం. కానీ.. పని కోసం నేను, నా భర్త బయటికి వెళ్లినప్పుడు వాళ్లు చాలా బాధపడుతున్నారు. వచ్చి మా ఒళ్లో కూర్చుని మాతో ఆడండి, ఎక్కడి వెళ్లకండి అని అంటున్నారు. ఆ చిన్నారులు అలా అంటున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ చేయక తప్పని పరిస్థతి. 


నటనలో ఫార్మల్ ట్రైనింగ్ తీసుకోవడానికి క్లాస్‌కి వెళ్లే ప్లాన్ ఏమైనా ఉందా అని అడిగితే.. ‘నా జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముగ్గురు పిల్లలు, రెండు కుక్కలు, అనేక ప్రాజెక్ట్‌లు.. కానీ వీటిని మ్యానేజ్ చేయడానికి సమయం సరిపోవడం లేదు. అవును.. ఏదైనా రంగంలో ఉన్నప్పుడు శిక్షణ తీసుకోవడం ఎంతో సహాయపడుతుంది. కానీ సినిమాని బట్టి నటన ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే దర్శకుడు చెప్పినట్లు ఫాలో అయిపోతుంటాను’ అని చెప్పుకొచ్చింది. కాగా.. సన్నీకి  ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరిని 2017లో దత్తత తీసుకోగా.. 2018లో సరోగసీ ద్వారా కవల పిల్లలు కలిగారు.

Updated Date - 2022-03-14T16:03:46+05:30 IST