నా గత జీవితం గురించి తెలిస్తే నా పిల్లలు నన్ను ఇష్టపడరేమో.. Sunny Leone మనసులోని మాటలివి..!

ABN , First Publish Date - 2022-06-09T01:17:16+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ సన్నీ లియోన్ (Sunny Leone). ‘జిస్మ్-2’(Jism-2) చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కరెంటు తీగ’ సినిమాలో నటించి తెలుగు

నా గత జీవితం గురించి తెలిస్తే నా పిల్లలు నన్ను ఇష్టపడరేమో.. Sunny Leone మనసులోని మాటలివి..!

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ సన్నీ లియోన్ (Sunny Leone). ‘జిస్మ్-2’(Jism-2) చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కరెంటు తీగ’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. చివరగా ‘అనామిక’ వెబ్ సిరీస్‌తో అందరిని అలరించింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వక ముందు సన్నీలియోన్ పొర్న్‌స్టార్ అన్న సంగతి తెలిసిందే. తన గతం గురించి కూడా ఆమె పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించింది. 


తన గతాన్ని తన పిల్లలు ఇష్టపడకపోవచ్చని మనసులోని మాటలను సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘పిల్లలు ఎదిగాక నా గతం గురించి తెలుసుకుని నన్ను ఇష్టకపోవచ్చు. నేను ఇంటి నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో ప్రశ్నలను అడగడం ద్వారా వారు తెలుసుకుంటారు. నాకు ఇష్టమున్న పనిని నేను చేశాను. నా పిల్లలు కూడా నచ్చిన పనిని చేస్తారు. ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు ఎవరికి ఇష్టమైన పనిని వారు చేయవచ్చు. నా కుమారుడు ఫైర్ ఫైటర్ కావాలనుకుంటున్నాడు. మీ పిల్లలు చేసే పనికి మీరు మద్దతుగా నిలవాలి’’ అని సన్నీలియోన్ తెలిపింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పింది. సినిమాలను ఎంతో ఇష్టంగా చేస్తున్నానని పేర్కొంది. బాలీవుడ్‌లో ఈ అందాల భామకు సినిమా ఆఫర్స్ అంత సులభంగా లభించలేదు. మొదట్లో నిర్మాతలు ఎక్కువగా బీ-గ్రేడ్ ఫిలిమ్స్‌లో మాత్రమే ఆఫర్స్ ఇచ్చేవారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్‌లో తన స్థానాన్ని ఆమె పదిలం చేసుకుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ ‘ఓ మై ఘోస్ట్’ (Oh My Ghost) అనే ప్రాజెక్టులో కనిపించనుంది. జాకీ ష్రాఫ్ (Jackie Shroff) సరసన అభిమానులను అలరించనుంది.

Updated Date - 2022-06-09T01:17:16+05:30 IST