జనం తనను ఆ విధంగానే కోరుకుంటున్నారు... అందుకే అలా కవ్విస్తోందట!

ABN , First Publish Date - 2022-03-12T04:19:11+05:30 IST

జనం తన నుంచి అదే కోరుతున్నారని... అందుకే తాను మళ్లీమళ్లీ అదే చేస్తున్నానని... అంటోంది సన్నీ లియోన్! ఎందుకని ఎప్పుడూ గ్లామరస్ క్యారెక్టర్సే చేయాల్సి వస్తోందో ఆమె వివరించింది...

జనం తనను ఆ విధంగానే కోరుకుంటున్నారు... అందుకే అలా కవ్విస్తోందట!

జనం తన నుంచి అదే కోరుతున్నారని... అందుకే తాను మళ్లీమళ్లీ అదే చేస్తున్నానని... అంటోంది సన్నీ లియోన్! ఎందుకని ఎప్పుడూ గ్లామరస్ క్యారెక్టర్సే చేయాల్సి వస్తోందో ఆమె వివరించింది. సన్నీ తాజా కామెంట్స్ ప్రకారం ప్రేక్షకులు ఆమె నుంచీ సెక్సీ లేదా సెన్సువల్ ఎంటర్టైన్మెంట్ కోరుతున్నారట. అందుకే, తాను కొత్త కొత్త పాత్రల్లో కాకుండా ఒకే విధమైన శృంగార అవతారాల్లో వెండితెరపై వెలిగిపోవాల్సి వస్తోందట... 


తన కెరీర్ ప్రారంభంలో పోర్న్ ఇండస్ట్రీలో యాక్ట్రస్‌గా పని చేసిన సన్నీ లియోన్ బాలీవుడ్‌లో కాలుమోపాక కూడా హాట్ రోల్స్, ఐటెం సాంగ్స్‌కే పరిమితం కావల్సి వచ్చింది. దక్షిణాది చిత్రాల్లోనూ తనకి పెద్దగా నటించే ఛాన్స్ దక్కలేదు. ‘డియ్యో డియ్యో’ బ్యూటీకి స్కిన్ షోనే ఆపర్స్ తెచ్చి పెడుతోంది. అయితే, దాని గురించి తనకేం అభ్యంతరం లేదంటోంది కెనడియన్ లేడీ. ఇప్పటికీ తన వద్దకి వచ్చే ఫిల్మ్ మేకర్స్ సెక్సువల్‌గా ఏదో ఒకటి తెరపై ప్రదర్శించాలని చెబుతుంటారట. వారలా అడగటం నాకేం ఇబ్బంది కాదంటోంది, ద ప్రొఫెషనల్ బ్యూటీ... సన్నీ! 

Updated Date - 2022-03-12T04:19:11+05:30 IST