నా మనస్సులో మరొకరు చేరారంటూ.. కత్రినాకి స్వాగతం పలికిన విక్కీ కౌశల్ సోదరుడు

ABN , First Publish Date - 2021-12-10T16:48:57+05:30 IST

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ ఇకపై అధికారికంగా భార్యభర్తలు. ఈ కపుల్ తమ రిలేషన్‌షిప్‌ని, పెళ్లిని ఎంతో సీక్రెట్‌గా ఉంచిన విషయం తెలిసిందే...

నా మనస్సులో మరొకరు చేరారంటూ.. కత్రినాకి స్వాగతం పలికిన విక్కీ కౌశల్ సోదరుడు

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ ఇకపై అధికారికంగా భార్యభర్తలు. ఈ కపుల్ తమ రిలేషన్‌షిప్‌ని, పెళ్లిని ఎంతో సీక్రెట్‌గా ఉంచిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఉరి’ స్టార్‌తో పెళ్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అఫిషీయల్‌గా ప్రకటించింది క్యాట్. దానికి ఆశీర్వాదించమని క్యాప్షన్ కూడా పెట్టింది ఈ తార.


కాగా, విక్యాట్ జంటకి కుటుంబంలోకి స్వాగతం పలికాడు విక్కీ సోదరుడు సన్నీ కౌశల్. ఇన్‌స్టాగ్రామ్ ఈ కపుల్ ఫోటోని షేర్ చేసి ‘ఈ రోజు నుంచి నా మనస్సులో మరొకరు చేరారు. ఫ్యామిలీలోకి స్వాగతం వదిన. మీ అద్భుతమైన జంట జీవితాంతం హ్యపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన’ని క్యాప్షన్ ఇచ్చాడు.


సన్నీ పోస్ట్‌పై ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు కామెంట్స్ పెట్టారు. నటుడు కరణ్ సింగ్ ఛబ్రా ‘వదిన అనే మాట వినడానికి ఎంతో బావుంది. రెండు ఫ్యామిలీలకి శుభాకాంక్షల’ని కామెంట్ పెట్టగా.. నటి మౌని రాయ్, ఫిల్మ్ మేకర్ శ్లోక్ శర్మ మరికొందరు హార్ట్ ఎమోజీలు పెట్టారు.


అయితే, కత్రినా సోదరి ఇసబెల్లా కైఫ్ ‘నిన్న నాకో కొత్త సోదరుడు దొరికాడు. మా క్రేజీ కుటుంబంలోకి స్వాగతం. ఎంతో సంతోషంగా ఉంది. మీరు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన’ని కామెంట్ పెట్టింది. అంతేకాకుండా ఎంతోమంది ఈ జంటకి విషెస్ చెప్పారు.



Updated Date - 2021-12-10T16:48:57+05:30 IST