Sakini dakini: దర్శకుడు మారితే ఆయన పేరు ఎందుకు ఉంటుంది?

ABN , First Publish Date - 2022-09-06T22:27:00+05:30 IST

కొరియన్‌ సినిమా ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘శాకినీ డాకినీ’. రెజీనా, నివేదా థామస్‌ నాయికలు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో సుధీర్‌ వర్మ కనిపించలేదు.

Sakini dakini: దర్శకుడు మారితే ఆయన పేరు ఎందుకు ఉంటుంది?

కొరియన్‌ సినిమా ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘శాకినీ డాకినీ’(Sakini dakini). రెజీనా, నివేదా థామస్‌ నాయికలు. సుధీర్‌ వర్మ (Sudheer varma)దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో సుధీర్‌ వర్మ కనిపించలేదు. కనీసం ఆ కార్యక్రమానికి సంబంధించి ఓ ట్వీట్‌ కూడా చేయలేదు. దీనితో సుధీర్‌ వర్మ ఈ చిత్రానికి పని చేస్తున్నాడా లేదా అన్న చర్చ మొదలైంది. అయితే దీని వెనుక ఓ బలమైన కారణం ఉందట. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి ఈ సినిమా మేకింగ్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మాతృకలో ఉన్నది ఉన్నట్లు దింపేయాలన్నది ఆమె వాదన అట. దర్శకుడు కొన్ని మార్పులు సూచించగా అందుకు ఆమె తిరస్కరించిందని వినికిడి. దాంతో అతను మాతృక ప్రకారమే చిత్రీకరణ చేశాడు. అవుట్‌పుట్‌ కాస్త అటుఇటుగా ఉండడంతో సునీత కొన్ని మార్పులు సూచించారట. ఆ మార్పులు చేయడానికి సుధీర్‌ వర్మ అంగీకరించలేదని, దాంతో దర్శకుడు ఆనంద్‌ రంగాతో మార్పులు చేర్పులు చేయించారనే వార్త కొద్ది రోజులుగా నెట్టింట వైరల్‌ అవుతోంది. 


దీనిపై సునీత తాటి వివరణ ఇచ్చారు. ‘‘సుధీర్‌వర్మ 2019 సెప్టెంబర్‌ నుంచి ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. రెండేళ్లు కరోనాతోనే గడిచిపోయింది. కాస్త ప్యాచ్‌ వర్క్‌ మిగిలి ఉంది. దానిని షూట్‌ చేయడానికి ఆయనకు సమయం కుదరలేదు. ఎందుకంటే ఆయన మరో పెద్ద సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయనకు ప్రైవసీ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే ఆయన సూచించిన వ్యక్తితోనే ఆ ప్యాచ్‌ వర్క్‌ చేయించాం. ఆయనకు, మాకు ప్రాబ్లమ్‌ ఉంటే దర్శకుడిగా ఆయన పేరు ఎందుకు ఉంటుంది? అని అన్నారు. నిర్మాత క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. 


Updated Date - 2022-09-06T22:27:00+05:30 IST