Singer Sunitha: నేనా... సినిమాలోనా..

ABN , First Publish Date - 2022-12-08T20:30:36+05:30 IST

సింగర్‌ సునీత సిల్వర్‌ స్ర్కీన్‌ ఎంట్రీ అంటూ ఎన్నోసార్లు వార్తలొచ్చాయి. వాటిని ఆమె ఖండించిన సందర్భాలు ఉన్నాయి. సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, పలు టీవీ షోల్లో న్యాయనిర్ణేతగా ఆమె ఎంతో బిజీగా గడుపుతున్న తరుణంలో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త మరోసారి హల్‌చల్‌ చేస్తోంది.

Singer Sunitha: నేనా... సినిమాలోనా..

సింగర్‌ సునీత (Singer sunitha) సిల్వర్‌ స్ర్కీన్‌ ఎంట్రీ అంటూ ఎన్నోసార్లు వార్తలొచ్చాయి. వాటిని ఆమె ఖండించిన సందర్భాలు ఉన్నాయి. సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, పలు టీవీ షోల్లో న్యాయనిర్ణేతగా ఆమె ఎంతో బిజీగా గడుపుతున్న తరుణంలో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త మరోసారి హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటి వరకు తెర వెనక తన వాయిస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిన సునీత తెరపై కూడా సందడి చేయనున్నారని సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ - మహేశ్‌బాబు (SSMB28)కాంబనేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంతో ఓ కీలక పాత్ర కోసం త్రివిక్రమ్‌ సునీతను సంప్రదించారని ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలిసింది. అయితే ఈ విషయం గురించి సునీతను సంప్రదించగా ‘ ఆ వార్తలను ఆమె ఖండించాను. ఇలాంటి వార్తలు రోజుకి ఒకటి పుట్టుకొస్తున్నాయని తెలిపారు. సినిమాల్లోకి వెళ్తేంత తీరుబడి లేదని సునీత చెప్పారు. 


Updated Date - 2022-12-08T20:30:36+05:30 IST