Pushpa the rule : కీలకపాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో?

ABN , First Publish Date - 2022-04-25T16:04:19+05:30 IST

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రైజ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని జాతీయ ప్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బన్నీ మేకోవర్, పెర్ఫార్మెన్స్, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రష్మికా గ్లామర్ అపీరెన్స్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కలగలిసి చిత్రాన్ని టాప్‌లో నిలబెట్టాయి. విడుదలైన అన్ని భాషల్లోనూ చిత్రం రికార్డు కలెక్షన్స్ రాబట్టి.. బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. మొదటి భాగం తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ కారణంగా రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్టవడంలో ఏఏ అంశాలు దోహదం చేశాయో.. రెండో భాగంలో అంతకు మించిన స్థాయిలో అభిమానులకు సర్ ప్రైజులు సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు.

Pushpa the rule : కీలకపాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రైజ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని జాతీయ ప్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బన్నీ మేకోవర్, పెర్ఫార్మెన్స్, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రష్మికా గ్లామర్ అపీరెన్స్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కలగలిసి చిత్రాన్ని టాప్‌లో నిలబెట్టాయి. విడుదలైన అన్ని భాషల్లోనూ చిత్రం రికార్డు కలెక్షన్స్ రాబట్టి.. బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. మొదటి భాగం తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ కారణంగా రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్టవడానికి ఏఏ అంశాలు దోహదం చేశాయో.. రెండో భాగంలో అంతకు మించిన స్థాయిలో అభిమానులకు సర్ ప్రైజులు సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో రెండో భాగంలో ఒక కీలకపాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోని రంగంలోకి దింపుతున్నాడట. 


బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి.. ‘పుష్ప ది రూల్’ లో సీనియర్ పోలీసాఫీసర్ పాత్రలో నటించబోతున్నారట. ఈ పాత్ర సినిమాకి చాలా కీలకమని తెలుస్తోంది. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రధారి ఫహద్ ఫాజిల్‌కు ఆయన బాస్‌గా నటిస్తున్నట్టు సమాచారం.  ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కే కింగ్ గా ఎదిగిన ‘పుష్పరాజ్’ కు అడుగడుగునా భన్వర్ సింగ్ అడ్డుతగిలితే..  సునీల్ శెట్టి పుష్పని సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తాడట. అలాగే ప్రీక్లైమాక్స్ లో సునీల్ శెట్టి ఇచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్ గా నిలిచిపోతుందని టాక్. తెలుగులో సునీల్ శెట్టి ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదు. ఇటీవల ‘గని’, అంతకు ముందు మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రాల్లో సునీల్ శెట్టి నటించగా ఆ సినిమాలు అంతగా ఆడలేదు. అలాగే.. రజినీకాంత్ ‘దర్బార్’ లో కూడా సునీల్ శెట్టి విలన్ గా నటించాడు. ఆ సినిమా కూడా ఆశించరీతిలో అలరించలేకపోయింది. మరి ‘పుష్ప ది రూల్’ మూవీ అయినా ఆయనకి మంచి హిట్టిస్తుందేమో చూడాలి.     

Updated Date - 2022-04-25T16:04:19+05:30 IST