Vamsi-Bhanupriya: ఇదిగో ఇలా నమస్కరించాలి

ABN , First Publish Date - 2022-09-08T04:05:58+05:30 IST

సితార (Sitaara).. దర్శకుడిగా వంశీ (Vamsy)కి రెండో సినిమా. హీరోయిన్‌గా భానుప్రియ(Bhanupriya)కు తెలుగులో తొలి చిత్రం. ఆమెను తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేసి నటిగా

Vamsi-Bhanupriya: ఇదిగో ఇలా నమస్కరించాలి

సితార (Sitaara).. దర్శకుడిగా వంశీ (Vamsi)కి రెండో సినిమా. హీరోయిన్‌గా భానుప్రియ(Bhanupriya)కు తెలుగులో తొలి చిత్రం. ఆమెను తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేసి నటిగా తీర్చిదిద్దిన ఘనత వంశీదే. ఇందులో సుమన్ (Suman) హీరోగా నటించారు. తను రాసిన నవల ‘మహల్లో కోకిల’ (Mahallo Kokila) ఆధారంగా ‘సితార’ చిత్రాన్ని రూపొందించారు వంశీ. పంజరంలో చిలుకలా ఉన్న జమీందారు కుటుంబానికి చెందిన ఓ యువతి ప్రేమ అనే స్వేచ్ఛను పొందడం ఈ చిత్ర కథ. 


‘సితార’ చిత్రంలో స్టార్ హీరో కానీ స్టార్ హీరోయిన్ కానీ లేరు. కానీ వంశీ అద్భుతమైన టేకింగ్, ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతం చిత్రాన్ని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ‘జిలి బిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా, కిన్నెర సాని వచ్చిందమ్మ, వెన్నెల్లో గోదారి అందం, కు కు కూ కోకిల గానం..’ వంటి పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇళయరాజాతో వంశీ పని చేసిన తొలి చిత్రం ‘సితార’. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. 1984లో విడుదలైన ‘సితార’.. ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డ్ పొందింది. చిత్రంలోని ఓ సన్నివేశంలో భానుప్రియకు నమస్కారం ఇలా పెట్టాలని దర్శకుడు వంశీ వివరిస్తున్న సందర్భమిది.


-వినాయకరావు



Updated Date - 2022-09-08T04:05:58+05:30 IST