సుమ కనకాల: జయమ్మ పంచాయితీ

ABN , First Publish Date - 2021-11-06T20:16:05+05:30 IST

సుమ కనకాల టాలీవుడ్‌లో పరిచయం అవసరం లేని యాంకర్‌. బుల్లితెర వ్యాఖ్యాతగా లక్షల మంది హృదయాలను గెలుచుకున్న ఆమె మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతున్నారు. అప్పుడు పలు చిత్రాల్లో యాంకర్‌, అతిథిగా కనిపించిన ఆమె దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించనున్నారు.

సుమ కనకాల: జయమ్మ పంచాయితీ

సుమ కనకాల టాలీవుడ్‌లో పరిచయం అవసరం లేని యాంకర్‌. బుల్లితెర వ్యాఖ్యాతగా లక్షల మంది హృదయాలను గెలుచుకున్న ఆమె మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతున్నారు. అప్పుడు పలు చిత్రాల్లో యాంకర్‌, అతిథిగా కనిపించిన ఆమె దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించనున్నారు. విజయ్‌ కుమార్‌ కాలివరపు దర్శకత్వం వహిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంలో సుమ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ శనివారం మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ‘‘సుమ మీకు ప్రతి తెలుగింటిలోనూ అభిమానులు ఉన్నారు. 70ఎంఎం స్ర్కీన్‌ మీద కూడా మీరు సందడి చేయాలి’’ అని రామ్‌చరణ్‌ ట్విట్టర్‌ వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో సుమ గ్రామీణ మహిళగా.. ఊరి పెద్ద స్థానంలో కనిపించనున్నారని పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. గతంలో  చూడని విధంగా సీరియస్‌ లుక్‌లో సుమ కనిపిస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై బలగ ప్రకాశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి  స్వరకర్త. 




Updated Date - 2021-11-06T20:16:05+05:30 IST