'సెల్ఫిష్' కోసం Sukumar ఇన్‌పుట్స్..

ABN , First Publish Date - 2022-06-17T15:09:13+05:30 IST

ఒకవైపు దర్శకుడిగా పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) నిర్మాతగాను మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు.

'సెల్ఫిష్' కోసం Sukumar ఇన్‌పుట్స్..

ఒకవైపు దర్శకుడిగా పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) నిర్మాతగాను మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థతో కలిసి తన సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్‌పై ఉప్పెన (Uppena) వంటి చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తూ సక్సెస్‌లు అందుకుంటున్నారు. అంతేకాదు, టాలెంటెడ్ హీరోలకు తనవైపు నుంచి చేయగలిగినంత సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'సెల్ఫిష్' అనే కొత్త చిత్రానికి సుక్కూ తన సహకారాన్ని  అందిస్తున్నారు.


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆశిష్ ( Hero Ashish) తన మొదటి సినిమా 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. పర్ఫార్మెన్స్ పరంగా ప్రేక్షకులు కూడా మంచి మార్కులు వేశారు. ప్రస్తుతం ఆశిష్ తన రెండవ సినిమాను దర్శకుడు విశాల్ కాశీ (Vishal Kasi) దర్శకత్వంలో చేస్తున్నాడు. 'సెల్ఫిష్' (Selfish) అనే టైటిల్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. రౌడీ బాయ్స్ సినిమాకి, ఈ సినిమాకి లుక్ పరంగా ఆశిష్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్‌తో 'సెల్ఫిష్' సినిమాలో కనిపించబోతున్నాడు.


అయితే, ఈ సినిమాకు సుకుమార్ డైలాగ్స్ అందివ్వడం విశేషం. ఇదే విషయాన్ని హీరో ఆశిష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ మేరకు సుకుమార్, చిత్ర దర్శకుడితో కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసి దానిలో సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. 'సుక్కు అన్న మా ''సెల్ఫిష్'' మూవీ కోసం మంచి డైలాగ్స్, ఇతర ఇన్ పుట్స్ ఇచ్చినందుకు అలాగే, ఈ సినిమాని మీ భుజాలపై తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'..అని ఆశిష్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మాత. 

Updated Date - 2022-06-17T15:09:13+05:30 IST