సుకుమార్ అంటే ఆ హీరోకి ఎంత అభిమానమో చూడండి!

ABN , First Publish Date - 2022-03-16T22:10:54+05:30 IST

హీరోలకి, హీరోయిన్లకి, రాజకీయ నాయకులకు అభిమానులుండటం సహజమే. కానీ దర్శకులకి అభిమానులుండటం.. అందులోనూ నటులు అభిమానులుగా ఉండటం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి ఒక హీరో.. తనకు నచ్చిన దర్శకుడిపై అభిమానం చూపిస్తే ఎలా ఉంటుందో? ఏ రేంజ్‌లో ఆ నటుడు..

సుకుమార్ అంటే ఆ హీరోకి ఎంత అభిమానమో చూడండి!

హీరోలకి, హీరోయిన్లకి, రాజకీయ నాయకులకు అభిమానులుండటం సహజమే. కానీ దర్శకులకి అభిమానులుండటం.. అందులోనూ నటులు అభిమానులుగా ఉండటం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి ఒక హీరో.. తనకు నచ్చిన దర్శకుడిపై అభిమానం చూపిస్తే ఎలా ఉంటుందో? ఏ రేంజ్‌లో ఆ నటుడు అభిమానాన్ని చాటుకున్నాడో చెప్పడానికి ఇదొక చక్కని నిదర్శనం. వివరాల్లోకి వెళితే, సువీక్షిత్‌ బొజ్జా అనే నవ, యువ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి వీరాభిమాని. పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచిన సుకుమార్‌ పై ఉన్న ప్రేమతో, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని కూడా చేయని ఓ గొప్ప కార్యానికి ఆయన శ్రీకారం చుట్టాడు. దానిని విజయవంతంగా పూర్తి చేశాడు.


‘దూరదర్శిని’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్‌.. తన సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లిలో.. రెండున్నర ఎకరాల సొంత వ్యవసాయ భూమిలో.. దర్శకుడు సుకుమార్‌ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు. దాదాపు 50 రోజుల వ్యయప్రయాసలతో.. ఆ పంటను సుకుమార్‌ రూపానికి ఆయన తీసుకువచ్చాడు. ఇలా అభిమానాన్ని చాటుకున్న సువీక్షిత్‌ అందరి దృష్టిని ఆకర్షించి హాట్‌ టాపిక్‌గా మారాడు. తన పంట భూమిని సుకుమార్ రూపానికి తీసుకువచ్చిన తర్వాత.. డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు.. సుకుమార్‌ పేరు మీద ఓ ప్రత్యేక పాటను కూడా రెడీ చేశాడు. సుకుమార్‌ రూపంతో పాటు.. ‘పుష్ప 2’ అని కూడా వరిసాగు చేయడం.. ఇప్పుడు అల్లు అర్జున్‌ అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్‌ను, వీడియోను చూసిన సుకుమార్‌ ‘‘నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?..’’ అంటూ అందరి సమక్షంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. సువీక్షిత్‌ని అభినందించారు.



Updated Date - 2022-03-16T22:10:54+05:30 IST