Shah Rukh Khan కూతురు Suhana Khanపై విపరీతంగా ట్రోలింగ్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-22T16:37:09+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫేమ్ ఉన్న స్టార్ కిడ్స్‌లో సుహానా ఖాన్ ఒకరు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో..

Shah Rukh Khan కూతురు Suhana Khanపై విపరీతంగా ట్రోలింగ్.. కారణం ఏంటంటే..

బాలీవుడ్‌లో మంచి ఫేమ్ ఉన్న స్టార్ కిడ్స్‌లో సుహానా ఖాన్ ఒకరు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 28 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఈ భామకి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట చాలా వేగంగా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో.. కారులోంచి దిగిన సుహానా ముంబైలోని ఓ హోటల్‌లోకి వెళుతోంది. ఈ తరుణంలో అక్కడే ఉన్న సోషల్ మీడియా రిపోర్టర్లు ఫొటోలకి స్టిల్స్ ఇవ్వమని కోరారు. కానీ.. సుహానా నవ్వుతూ హోటల్‌లోకి వెళ్లిపోయింది. అది చూసిన ఓ రిపోర్టర్ మీ సినిమా త్వరలో వస్తుందని, స్టిల్స్ ఇవ్వమని కోరాడు. అయినప్పటికీ తను అలాగే నవ్వుతూ వెళ్లిపోయింది. ఈ వైరల్ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు సుహానాని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.


‘మరో నెపోకిడ్’ అంటూ కొందరూ.. ‘మొదటి సినిమా విడుదల కాకుండానే ఎంత యాటిట్యూడ్ చూడండి’ అని మరికొందరూ.. ‘ఇలాంటి వాళ్ల సినిమాలు ఎందుకు చూస్తారు’ అంటూ ఇంకొందరు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. ‘ఆమెకి ఇష్టం లేకపోతే అలాగే వదిలేయండి. ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు’ అంటూ పలువురు నెటిజన్లు సుహానాకి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ బ్యూటీ ప్రస్తుతం జోయా అక్తర్ దర్శకత్వంలో The Archies అనే నెట్‌ఫ్లిక్స్ ఓరిజినల్ మూవీలో నటిస్తోంది. అందులో.. అమితాబ్ బచ్చన్ మనువడు అగస్త్య నంద, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌తో పాటు మరికొందరూ స్టార్‌ కిడ్స్‌తో కలిసి నటిస్తోంది.



Updated Date - 2022-06-22T16:37:09+05:30 IST