Hunt teaser: ఎంత ఎఫెక్ట్ అయినా.. ఎవరూ ఆపలేరు
ABN , First Publish Date - 2022-10-03T19:57:44+05:30 IST
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘హంట్’(Hunt). మహేష్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిేస్త’ ఫేమ్ భరత్ కీలక పాత్రధారులు.
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘హంట్’(Hunt). మహేష్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ కీలక పాత్రధారులు. పోలీస్ నేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. పక్కా యాక్షన్ టీజర్‌గా కట్ చేశారు. సుధీర్‌బాబు నటనతోపాటు సిక్స్ ప్యాక్ బాడీ ఆకట్టుకునేలా ఉంది. ‘తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రక్రియలో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు’ అని టీజర్ చివరలో సుధీర్‌బాబు చెప్పిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది.
‘‘అర్జున్‌లో ఇద్దరు ఉన్నారు! ఒకరు ‘ఎ’, మరొకరు ‘బి’ అనుకుంటే... అర్జున్ ‘ఎ’కి తెలిసిన మనుషులు, ఇన్సిడెంట్స్, పర్సనల్ లైఫ్ ఏదీ అర్జున్ ‘బి’కి తెలియదు. అర్జున్ ‘ఎ’కి తెలిసిన భాషలు, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ అర్జున్ ‘బి’లో ఉన్నాయి. అర్జున్ ‘ఎ’గా ఉండటమే అర్జున్‌కు ఇష్టం! అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయిన కేస్ ఏంటి? అన్నది తెరపై చూడాలంటున్నారు దర్శకుడు మహేశ్. ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి.