Tollywood: ఆగస్ట్ 1 నుండి బంద్ జరిగితే.. ఈ సినిమాలకే పెద్ద దెబ్బ!

ABN , First Publish Date - 2022-07-28T00:08:37+05:30 IST

యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అసోసియేషన్ ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నామని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటికే సెట్స్ పైన ఉన్న NBK107, RC15, సలార్ (Salaar), ప్రాజెక్ట్ k (Project K) సినిమాలకి

Tollywood: ఆగస్ట్ 1 నుండి బంద్ జరిగితే.. ఈ సినిమాలకే పెద్ద దెబ్బ!

యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అసోసియేషన్ ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నామని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటికే సెట్స్ పైన ఉన్న NBK107, RC15, సలార్ (Salaar), ప్రాజెక్ట్ k (Project K) సినిమాలకి బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. ఈ నాలుగు సినిమాల షూటింగ్స్ జెట్ స్పీడ్‌లో జరుగుతున్న టైంలో గిల్డ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, మన హీరోల స్పీడ్‌కి సడన్ బ్రేకులు వేసినట్లు అయ్యింది. ఈ నాలుగు సినిమాలతో పాటు ఆగస్ట్‌లోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన కొరటాల-ఎన్టీఆర్ (Koratala-NTR) సినిమా, పుష్ప 2 (Pushpa 2), SSMB 28 సినిమాల షూటింగులు కూడా అయోమయంలో పడ్డాయి.


ఈ సడన్ డెసిషన్ వల్ల షెడ్యూల్ బ్రేక్‌లో ఉన్న Chiru154, హరిహర వీరమల్లు (Harihara Veeramallu), దసరా(Dasara) సినిమాల భవిషత్తు కూడా అయోమయంలో పడింది. ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకుని, అందరూ కలిసి చర్చించుకుని... ఒక మంచి సొల్యూషన్‌ని తీసుకున్న తర్వాతే సినిమాల షూటింగ్స్ మొదలుకానున్నాయి. ఆ దిశగా ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పటివరకూ గిల్డ్ అసోసియేషన్‌లో ఉన్న నిర్మాతలు నిర్మిస్తున్న సినిమా ఒక్కటి కూడా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదు. హీరోలు, దర్శకనిర్మాతలు కలిసి కూర్చోని వీలైనంత త్వరగా ఒక సొల్యూషన్‌ని కనుక్కొని, ఇండస్ట్రీని ఈ సంక్షోభం నుంచి బయట పడేస్తారని 24 క్రాఫ్ట్స్ లో పని చేసే వాళ్ళు.. ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే హీరోల సైడ్ నుండి రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఓ వార్త బయటికి వచ్చింది. ఇంకా ఉన్న సమస్యలపై గిల్డ్ ప్రతినిధులు పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Updated Date - 2022-07-28T00:08:37+05:30 IST