International Kissing Day 2022: బాలీవుడ్‌ సెలబ్రిటీలకు సడెన్‌ ముద్దులు పెట్టిన పాపులర్ ఫిగర్స్ వీళ్లే..

ABN , First Publish Date - 2022-07-06T22:24:53+05:30 IST

ఇతరులపై అభిమానాన్ని ఒక్కొకరూ ఒక్కోరకంగా చూపుతారు. కొందరూ మాటల్లో చూపితే మరొకరు చేతల్లో చూపుతారు...

International Kissing Day 2022: బాలీవుడ్‌ సెలబ్రిటీలకు సడెన్‌ ముద్దులు పెట్టిన పాపులర్ ఫిగర్స్ వీళ్లే..

ఇతరులపై అభిమానాన్ని ఒక్కొకరూ ఒక్కోరకంగా చూపుతారు. కొందరూ మాటల్లో చూపితే మరొకరు చేతల్లో చూపుతారు. మరికొందరైతే ముద్దు పెట్టి చూపుతారు. అయితే కొన్నిసార్లు పలువురు సెలబ్రిటీలు ఇతరులను సడెన్‌గా ముద్దులు పెట్టుకుని కెమెరా కంటికి చిక్కారు. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం సందర్భంగా అలాంటి సడెన్ కీస్సెస్‌ని ఎదుర్కొన్న పలువురు సినీ తారల గురించి తెలుసుకుందాం..


1. రిచర్డ్ గేర్‌-శిల్పాశెట్టి

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేరే (Richard Gere) 2007లో ఢిల్లీలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. అందులో భాగంగా స్టేజ్‌పై శిల్పా మాట్లాడుతుండగా.. సడన్‌‌గా రిచర్డ్ ఆమె రెండు బుగ్గలపై ముద్దు పెట్టేశాడు. ఈ ముద్దుపై వివాదం చేలరేగగా.. దాదాపు 15 ఏళ్ల పాటు కేసు కూడా నడిచింది. ఇటీవలే ఆ కేసు నుంచి శిల్పాకి ఉపశమనం లభించింది.


2. విద్యాబాలన్‌-అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ (Vidya Balan) ఓ అవార్డు ఫంక్షన్‌లో బెస్ట్ యాక్రెస్‌గా అవార్డు అందుకుంది. ఈ తరుణంలో అక్కడే ఉన్న బాలీవుడ్ మెగాస్టార్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) ఆ నటి బుగ్గపై సడెన్‌గా ముద్దు పెట్టుకున్నాడు.


3. అనుష్క శర్మ- దీపికా పదుకొనే

బాలీవుడ్ లీడ్ హీరోతో కలిసి చేసిన ఓ సినిమాలో నటనకి గానూ అనుష్క శర్మ (Anushka Sharma)ను ఓ అవార్డుల ఫంక్షన్‌లో ఉత్తమ నటి అవార్డు వరించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న దీపిక పదుకొనే (Deepika Padukone) సడెన్‌గా అనుష్క శర్మను బుగ్గ మీద ముద్దాడింది.


4. సల్మాన్ ఖాన్‌- షారుఖ్ ఖాన్

బాలీవుడ్ నటుటు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో షారుఖ్ సడెన్‌గా సల్మాన్ బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పిక్ అప్పట్లో నెట్టింట హల్‌చల్ చేసింది.


5. విజయ్ మాల్యా-శిల్పా శెట్టి

పేద ప్రజలకు సేవ చేయడంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఎప్పుడూ ముందుంటుంది. ఇలా పేదలకు సహాయం చేసేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో విజయ్ మాల్యా (Vijay Mallya)తో కలిసి ఈ భామ పాల్గొంది. ఆ సందర్భంలో విజయ్ మాల్యా సడెన్‌గా శిల్పా శెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు.


6. రాణి ముఖర్జీ-కత్రినా కైఫ్

ఓసారి కత్రినా కైఫ్, రాణి ముఖర్జీ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో కత్రినాని రాణీ బాగా ఎంకరేజ్ చేసింది. దీంతో ఆనందం పట్టలేక రాణిని క్యాట్ ముద్దాడింది.


7. అల్విరా అగ్నిహోత్రి-కత్రినా కైఫ్

కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ మధ్య ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కత్రినకి మంచి బంధం ఉండేది. ఆ తరుణంలో సల్మాన్ చెల్లెలు అల్విరా అగ్నిహోత్రితో డిన్నర్‌కి వెళ్లింది. అక్కడి నుంచి వెళ్లిపోతూ అల్విరాని కత్రినా ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. ఆ సీన్ మీడియా కంట పడడంతో కెమెరాతో క్లిక్ మనిపించారు.

Updated Date - 2022-07-06T22:24:53+05:30 IST