బలవంతంగా బట్టలు విప్పించి మైనర్ బాలికపై వేధింపులు.. నటి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-13T15:12:21+05:30 IST

ఇంటిలో పని చేసే మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిందని 25 ఏళ్ల నటిని అరెస్టు చేశారు వెర్సోవా పోలీసులు. నివేదిక ప్రకారం, ఆ స్ర్టగ్లింగ్ నటి వెర్సోవాలోని ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తోంది.

బలవంతంగా బట్టలు విప్పించి మైనర్ బాలికపై వేధింపులు.. నటి అరెస్టు

ఇంటిలో పని చేసే మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిందని 25 ఏళ్ల నటిని అరెస్టు చేశారు వెర్సోవా పోలీసులు.  నివేదిక ప్రకారం, ఆ స్ర్టగ్లింగ్ నటి వెర్సోవాలోని ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తోంది. పనిని సరైన సమయానికి పూర్తి చేయనందుకు ఆ బాలికపై దాడి చేసింది.


పోలీసులు ఫైల్ చేసిన కేసులో తాను సరిగ్గా పని చేయలేదని ఆరోపిస్తూ ఆ నటి తనపై అనేక సందర్భాల్లో దాడి చేసిందని బాలిక పోలీసులకు తెలిపింది. ఇలా ఇప్పటికి చాలాసార్లు దాడి చేసినప్పట్టికి.. ఈ సారి మాత్రం బట్టలు విప్పమని బలవంతం చేసి ఫోటోలు, వీడియోలు తీయడంతో తట్టుకోలేక ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


అంతేకాకుండా తనపై చెప్పుతో దాడి చేయడంతో తలపై గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు బాధితురాలు కంప్లైంటులో పేర్కొంది. ఆమె సోదరి గాయాలను గమనించి, వాటి గురించి ఆరా తీయడంతో జరిగిన విషయాన్ని వివరించింది. అనంతరం సోదరి పోద్బాలంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.


పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 326 (దాడి), 354 (బి), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), పిల్లల రక్షణ, లైంగిక నేరాల చట్టం (పోక్సో)  కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలిక మైనర్ అని మహిళకు తెలిసినప్పటికీ, ఆమె ఆమెను పనిలో పెట్టుకుందని, అలాగే నటిని అరెస్టు చేసి, సోమవారం వరకు కస్టడీలో ఉంచుతామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.



Updated Date - 2021-12-13T15:12:21+05:30 IST