ఒంటిపై ఎప్పుడూ బంగారంతోనే ఉండే బప్పి లహిరి ఇంట్లో ఎంత బంగారం ఉందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-16T22:02:40+05:30 IST

బాలీవుడ్‌కు డిస్కో సాంగ్స్‌ను పరిచయం చేసింది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్

ఒంటిపై ఎప్పుడూ బంగారంతోనే ఉండే బప్పి లహిరి ఇంట్లో ఎంత బంగారం ఉందో తెలిస్తే..

బాలీవుడ్‌కు డిస్కో సాంగ్స్‌ను పరిచయం చేసింది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లహిరి. సినీ ఇండస్ట్రీలోనే బప్పి లహిరిది ప్రతేక్యమైన స్టైల్. పాటలతోనే కాకుండా ప్రత్యేకమైన ఆహార్యంతోనూ ప్రేక్షకుల మదిని దోచారు. ఆయనకు బంగారు ఆభరణాలంటే విపరీతమైన ఇష్టం. ‘ధన త్రయోదశి’ నాడు తప్పకుండా ఏదో ఒక ఆభరణాన్ని కొనుగోలు చేసేవారు. ఆయనను ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా పిలుస్తుంటారు. ఆయన బీజేపీ తరఫున 2014లో ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లో తన వద్ద 754గ్రాముల బంగారం, 4.62కిలోల వెండి, తన భార్య  వద్ద 967గ్రాముల బంగారం, 8.9కిలోల వెండి ఉందన్నారు. బప్పి లహిరి, అతడి భార్య వద్ద దాదాపుగా 1.7కిలోల బంగారం ఉందని వెల్లడించారు. ‘గోల్డ్ ఈజ్  మై గాడ్’ అని ఆయన అంటుండేవారు. తనకు బంగారం అంటే ఎందుకంత ఇష్టమో కూడా ఓ ఇంటర్వ్యూలో  చెప్పారు. 


హాలీవుడ్ పాప్ సింగర్ ఎల్వీస్ ప్రెస్లీని చూశాక బంగారంపై ఇష్టం పెరిగిందన్నారు. ఆయన ఆహార్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. బంగారు ఆభరణాలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని వెల్లడించేవారు. ‘‘సినీ ఇండస్ట్రీలో ఎదిగాక ఎల్విస్ ప్రెస్లీలా ఆభరణాలు ధరించాలని అనుకునేవాడిని. ‘జాక్మీ’ పాటలు రికార్డింగ్ చేస్తున్న సమయంలో గణపతి బొమ్మతో కూడిన లాకెట్‌ను మా అమ్మ బహుమతిగా ఇచ్చింది. ఆ అల్బమ్ సూపర్ హిట్ అయింది. కొన్ని ఏళ్ల తర్వాత మరో లాకెట్‌ను ఇవ్వగా నాకు పెళ్లయింది. దీంతో అప్పటి నుంచి బంగారాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇండస్ట్రీలో ఎదుగుతున్న కొద్ది ధరించే బంగారం కూడా రెట్టింపయింది. ఈ బంగారు ఆభరణాలను ఎప్పుడు ధరిస్తూనే ఉంటాను. పబ్లిక్‌లోకి కూడా బంగారంతోనే వెలుతుంటాను. నేను ఇవి లేకుండా బయటకు వెళితే ప్రజలు నన్ను గుర్తు పట్టలేరు’’ అని బప్పి లహిరి చెప్పారు.

Updated Date - 2022-02-16T22:02:40+05:30 IST