గ్రాండ్‌గా AR Rahman కుమార్తె Khatija Rahman వెడ్డింగ్ రిసెప్షన్

Twitter IconWatsapp IconFacebook Icon
గ్రాండ్‌గా AR Rahman కుమార్తె Khatija Rahman వెడ్డింగ్ రిసెప్షన్

టాప్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్. రెహమాన్(AR Rahman) కుమార్తె ఖతీజా రెహమాన్ (Khatija Rahman) పెళ్లి మే 7న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆడియో ఇంజినీర్ రియాసిద్దీన్ షేక్ మహ్మద్‌ను (Riyasdeen Shaik Mohamed) ఖతీజా పెళ్లాడింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ఆమె జూన్ 10న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అదే రోజు ఏఆర్. రెహమాన్ చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రెహమాన్ మిత్రులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది ఆర్టిస్టులు స్టేజి మీద ప్రదర్శనలు ఇచ్చారు. 


ఏఆర్. రెహమాన్ తనయ ఖతీజా నిశ్చితార్థం గతేడాది డిసెంబర్ 29న జరిగింది. వివాహం మేలో అయింది. జూన్ 10న గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కొంత మంది నటులతో పాటు సింగర్స్, మ్యూజిషియన్స్, ఫిల్మ్ వేకర్స్ హాజరయ్యారు. మనీషా కోయిరాలా, మణిరత్నం, శేఖర్ కపూర్, సోనూ నిగమ్, ఉదిత్ నారాయణ్, జావేద్ అలీ, అబ్దు రజాక్, శివమణి, జతిన్ పండిత్ తదితరులు విచ్చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వేడుకకు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వాదించారు. పాప్ సింగర్ హానీసింగ్ (Honey Singh) కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానుతో పంచుకున్నాడు. ‘‘కొత్త జంటకు శుభాకాంక్షలు. ఏఆర్. రెహమాన్ సార్ గారి కుటుంబానికి, అభిమానులకు అభినందనలు’’ అని సోషల్ మీడియాలో హానీసింగ్ పోస్ట్ పెట్టాడు. రిసెప్షన్‌లో అబ్దు రజాక్ ఓ పాటను అలపించాడు.  




AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.