బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ ప్రయోగాలు చేసే నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi). అభిమానులందరు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుచుకుంటుంటారు. ‘సూపర్ డీలక్స్’, ‘విక్రమ్ వేద’, ‘96’, ‘ఉప్పెన’ వంటి విభిన్న తరహా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘కాతువక్కుల రెండు కాదల్’ (Kaathuvaakula Rendu Kaadhal). ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. సమంత(Samantha), నయనతార(Nayanthara) కీలక పాత్రలు పోషించారు. మూవీ చివరలో ఈ ఇద్దరితో పాటు మరో హీరోయిన్ కూడా దర్శనమిచ్చింది.
‘కాతువక్కుల రెండు కాదల్’ లో ఎండ్ క్రెడిట్ సీన్‌లో కత్రినా కైఫ్(Katrina Kaif) ఫొటోను వాడుకున్నారు. కత్రినా పిక్‌ను చిత్రంలో వాడుకోవడానికీ ముందుగా విజయ్ సేతుపతి ఆమెను పర్మిషన్ అడిగారు. స్టార్ హీరో అలా అడగడంతోనే కత్రిన ఒకే చెప్పేసింది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలసి ‘మెర్రి క్రిస్‌మస్’ (Merry Christmas) చిత్రంలో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్(Srirram Raghavan) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందువల్ల ఫొటో వాడుకోవడానికీ కత్రిన ఎంటనే పర్మిషన్ ఇచ్చింది. ‘మెర్రి క్రిస్‌మస్’లో కత్రినతో కలసి పనిచేయడం సంతోషంగా ఉందని గతంలో విజయ్ తెలిపారు. ‘‘కత్రినా కైఫ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆమె చాలా ప్రొఫెషనల్ యాక్టర్. ‘మెర్రి క్రిస్‌మస్’ కోసం శ్రీరామ్ అద్భుతమైన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. ఫైనల్ కట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని విజయ్ సేతుపతి చెప్పారు.