కమల్ హాసన్ ‘విక్రమ్’ (Vikram)సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు ఎవరికంటే..?

ABN , First Publish Date - 2022-05-06T00:04:34+05:30 IST

ప్రయోగాత్మక సినిమాలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). అన్ని రకాల ఎమోషన్స్‌ను

కమల్ హాసన్ ‘విక్రమ్’ (Vikram)సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు ఎవరికంటే..?

ప్రయోగాత్మక సినిమాలు, విభిన్నమైన  పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). అన్ని రకాల ఎమోషన్స్‌ను అతడు ఒకే ఫ్రేమ్‌లో చూపించగలడు. తాజాగా అతడు హీరోగా నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి(vijay sethupathi), ఫహద్ ఫాజిల్ (fahadh faasil) కీలక పాత్రలు పోషించారు. కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. తాజాగా చిత్ర బృందం శాటిలైట్, డిజిటల్ రైట్స్ పార్ట్‌నర్లను వెల్లడించింది. 


‘విక్రమ్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్‌’ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ రైట్స్‌ను ‘డిస్నీ+హాట్ స్టార్‌’ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుందని కోలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. తమిళ శాటిలైట్ హక్కులను స్టార్ విజయ్, తెలుగు హక్కులను స్టార్ మా, కన్నడ హక్కులను స్టార్ సువర్ణ, హిందీ హక్కులను స్టార్ గోల్డ్, మలయాళ హక్కులను  ఏషియానెట్ దక్కించుకున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. చిత్ర ట్రైలర్‌ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival)లో కూడా ప్రదర్శించబోతున్నారని తెలుస్తోంది. ట్రైలర్ మే 15న విడుదల కానుంది.



Updated Date - 2022-05-06T00:04:34+05:30 IST