గతాన్ని గుర్తు చేసిన Sushmita Sen.. షూటింగ్‌లో అందరి ముందే Mahesh Bhatt నన్ను దారుణంగా అవమానించారంటూ..

ABN , First Publish Date - 2022-07-02T20:28:28+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినీ ఇండస్ట్రీలో కథానాయికగా మారిన అందాల భామ సుస్మితా సేన్ (Sushmita Sen). మిస్ యూనివర్స్ కిరీటాన్ని 1994లో గెలుచుకుంది. అనంతరం మహేశ్ భట్(Mahesh

గతాన్ని గుర్తు చేసిన Sushmita Sen.. షూటింగ్‌లో అందరి ముందే Mahesh Bhatt నన్ను దారుణంగా అవమానించారంటూ..

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినీ ఇండస్ట్రీలో కథానాయికగా మారిన అందాల భామ సుస్మితా సేన్ (Sushmita Sen). మిస్ యూనివర్స్ కిరీటాన్ని 1994లో గెలుచుకుంది. అనంతరం మహేశ్ భట్(Mahesh Bhatt) దర్శకత్వం వహించిన ‘దస్తక్’ (Dastak) చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ట్వింకిల్ ఖన్నా షోలో పాల్గొంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంది. ఆ సమయంలో అందరి ముందే మహేశ్ భట్ తనను దారుణంగా అవమానించారని పేర్కొంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పింది.


కుటుంబంతో సమయం గడపడానికి సుస్మితా సేన్ లాస్ ఏంజెలిస్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు మహేశ్ భట్ ఫోన్ చేశారు. ‘‘సరదాగా కలుద్దాం అని చెప్పారు. సినిమాలో నటించమని అడిగారు. నాకు నటించడం రాదని చెప్పాను. అయినప్పటికి బలవంతం చేయడంతో చిత్రానికి ఒప్పుకున్నాను. షూటింగ్‌ను ప్రారంభించారు. ముహుర్తం షాట్ షూట్ చేస్తున్నారు. నేను బాగా నటించలేదు. దీంతో 40మంది మీడియా వ్యక్తులు, 20మంది ప్రొడక్షన్ బాయ్స్ ముందు నన్ను దారుణంగా అవమానించారు. నాకు నటించడం రాదని అంతకు ముందే చెప్పినప్పటికీ.. సినిమాలోకి ఎందుకు తీసుకున్నారని అడిగాను. కెమెరా ముందు ఈ విధంగా చేసి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుని అక్కడ నుంచి ఏం పట్టుకుని వచ్చావన్నారు. జీవితాన్ని కాపాడుకోవడానికి ఆమె నటించదన్నారు. నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. సెట్ నుంచి నడిచి వెళ్లడం ప్రారంభించాను. నాతో ఆ విధంగా మాట్లాడాల్సింది కాదని చెప్పాను. అప్పుడు నా దగ్గరకు వచ్చి దీనిని కోపం అంటారు. ఆ విధంగానే షాట్ చెయ్యి అన్నారు’’ అని సుస్మితా సేన్ వెల్లడించింది. అందుకే మహేశ్ భట్‌ను అద్భుతమైన డైరెక్టర్ అని ఆమె పొగిడింది. ఇక కెరీర్ విషయానికి వస్తే సుస్మితా సేన్.. ‘బీవీ నెం-1’ (Biwi No 1), ‘డు నాట్ డిస్టర్బ్’, ‘మై హునా’, ‘మైనే ప్యార్ క్యూ కియా’, ‘నో ప్రాబ్లమ్’ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా ‘ఆర్య’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.  

Updated Date - 2022-07-02T20:28:28+05:30 IST