ఫుడ్ డెలివరీ బాయ్‌గా కపిల్ శర్మ.. ఎవరికీ చెప్పొద్దంటోన్న స్టార్ కమెడియన్..

ABN , First Publish Date - 2022-03-20T22:51:31+05:30 IST

బాలీవుడ్‌లో అందరికీ సుపరిచితమైన పేరు కపిల్ శర్మ

ఫుడ్ డెలివరీ బాయ్‌గా కపిల్ శర్మ.. ఎవరికీ చెప్పొద్దంటోన్న స్టార్ కమెడియన్..

బాలీవుడ్‌లో అందరికీ సుపరిచితమైన పేరు కపిల్ శర్మ. కామెడీ షోలతో దేశ వ్యాప్తంగా అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. 2007లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత పలు కామెడీ షోల్లో పాల్గొని అందరిని నవ్వించాడు. అనంతరం ‘కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ’ టాక్ షోను నిర్వహించాడు. ఈ షో విజయవంతం కావడంతో స్టార్ కమెడియన్‌గా మారాడు. తాజాగా కపిల్ శర్మ ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ స్టార్ కమెడియన్ ఫుడ్‌ను ఎందుకు డెలివరీ చేస్తున్నాడో తెలుసుకోవాలనుందా..  


నందితా దాస్ దర్శకత్వంలో కపిల్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఒడిషాలోని భువనేశ్వర్‌లో జరుగుతుంది. ప్రస్తుతం కపిల్‌కు సంబంధించిన సీన్లను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే అతడు ఫుడ్‌‌ను డెలివరీ చేస్తున్నాడు. ఈ సీన్ చేస్తున్న సమయంలో‌నే ఓ అభిమాని అతడిని ఫొటో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో కపిల్‌కు ట్యాగ్ చేశాడు. ‘‘లైవ్‌లో మిమ్మల్ని చూశాను సార్’’ అని ఫ్యాన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు స్టార్ కమెడియన్ రిప్లై ఇచ్చాడు. ‘‘ఎవరికీ చెప్పకు’’ అని కొంటెగా కపిల్ సమాదానమిచ్చాడు. ఈ మూవీ షూట్‌లో భాగంగా కపిల్, నందితా దాస్ ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కూడా కలిశారు.



Updated Date - 2022-03-20T22:51:31+05:30 IST