కొత్త సినిమాను ప్రకటించిన Sai Pallavi

ABN , First Publish Date - 2022-05-10T02:11:10+05:30 IST

కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించే నటి సాయిపల్లవి (Sai Pallavi). నాని(Nani) హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) ఆమె ఏ ప్రాజెక్టును అంగీకరించలేదు.

కొత్త సినిమాను ప్రకటించిన Sai Pallavi

కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలను అంగీకరించే నటి సాయిపల్లవి (Sai Pallavi). నాని(Nani) హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) తర్వాత ఆమె ఏ ప్రాజెక్టును ఒకే చేయలేదు. సాయిపల్లవి మే 9న పుట్టిన రోజు జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాను ప్రకటించింది. 


‘గార్గి’ (Gargi) చిత్రంలో నటించనున్నట్టు సాయిపల్లవి తెలిపింది. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘ఈ సినిమా గురించి మాట్లాడాలని కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తున్నాను. చివరకు నా పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. గౌతమ్ రామచంద్రన్ బేబీ ‘గార్గి’ని మీ ముందుకు తీసుకువస్తున్నాం’’ అని సాయిపల్లవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ  భాషల్లో తెరకెక్కనుంది. ‘రిచీ’ (Ritchie) ఫేమ్ గౌతమ్ రామచంద్రన్ (Gautham Ramachandran) దర్శకత్వం వహిస్తున్నాడు. ‘గార్గి’ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కిన్నట్టు తెలుస్తోంది. సాయిపల్లవి ఇందులో న్యాయం కోసం పోరాడే మహిళగా కనిపించనుంది. ఈ సినిమాను రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ కలసి నిర్మిస్తున్నారు. ‘గార్గి’ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. 





Updated Date - 2022-05-10T02:11:10+05:30 IST