SS.Rajamouli: మహేశ్‌‌తో చేయబోయే సినిమా నా కెరీర్‌లోనే పెద్దది

ABN , First Publish Date - 2022-10-01T21:23:01+05:30 IST

భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఖండాతరాలను దాటించిన దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS.Rajamouli). ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో

SS.Rajamouli: మహేశ్‌‌తో చేయబోయే సినిమా నా కెరీర్‌లోనే పెద్దది

భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఖండాతరాలను దాటించిన దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS.Rajamouli). ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో బారతీయ సినిమాల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌పామ్‌లోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ చిత్రంపై విదేశీ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన అనేక మంది టెక్నిషీయన్స్ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా రాజమౌళి హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. మహేశ్ బాబు (Mahesh Babu) తో చేయబోయే సినిమా గురించి మాట్లాడాడు. 


హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్‌’ (Beyond Fest)లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులందరు సినిమాను మైమరచి వీక్షించారు. మూవీ పూర్తి కాగానే రాజమౌళికి స్టాండింగ్ ఒవియేషన్ ఇచ్చారు. అనంతరం స్టేజ్ పైకి వచ్చి అతడు మాట్లాడాడు. మహేశ్ బాబుతో చేయబోయే సినిమా గురించి తెలిపాడు. మహేశ్‌తో తెరకెక్కించే సినిమా తన కెరీర్‌లో‌నే భారీదని చెప్పాడు. ఇప్పటి వరకు అటువంటి చిత్రాన్ని చేయలేదన్నాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా మూవీని రూపొందిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో ట్రెండ్ అవుతుందని స్పష్టం చేశాడు. ‘‘నేను అమెరికాలోని ఫిలిం ఫెస్టివల్‌కు వచ్చాననుకున్నాను. కానీ, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులను చూస్తే అమెరికా, ఆమిర్‌పేట్‌లా కనిపిస్తుంది’’ అని రాజమౌళి వెల్లడించాడు. రాజమౌళితో సినిమా చేయబోతుండటంతో మహేశ్ బాబు తన సంతోషాన్ని గతంలోనే మీడియాతో పంచుకున్నాడు. ఆ మూవీ గురించి మాట్లాడాడు. ‘‘రాజమౌళి‌తో ఒక్క సినిమాకు పనిచేస్తే 25 చిత్రాలకు పనిచేసినట్లే. ఈ మూవీలోని పాత్ర కోసం చాలా శ్రమించాలి. ఎందుకంటే సినిమా దానిని డిమాండ్ చేస్తుంది. జక్కన్నతో చేయబోయే చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ ప్రాజెక్టు  పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. దేశంలోని ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని మహేశ్ బాబు పేర్కొన్నాడు.





Updated Date - 2022-10-01T21:23:01+05:30 IST