SSMB 28: థమన్ మొదలు పెట్టాడు..

ABN , First Publish Date - 2022-07-09T17:40:42+05:30 IST

మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ (SS Thaman) వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన సంగీతం అందించిన సినిమాలు మ్యూజికల్‌గా మంచి సక్సెస్ సాధిస్తున్నాయి.

SSMB 28: థమన్ మొదలు పెట్టాడు..

మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ (SS Thaman) వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన సంగీతం అందించిన సినిమాలు మ్యూజికల్‌గా మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతోంది. అందుకే, హీరోలు..దర్శకనిర్మాతలు మిగతావారికంటే కూడా థమన్ నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం థమన్ సంగీతమందిస్తున్న సినిమాలలో మహేశ్ బాబు కొత్త సినిమా కూడా చేరింది. ఎస్ఎస్ఎంబి 28గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి దర్శకుడు మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌ను థమన్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన సంగీతం అందిస్తున్న ప్రతీ సినిమా అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటారు. మరి తాజాగా మహేశ్ సినిమాకు మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టిన థమన్ ఎలాంటి ట్యూన్స్ ఇస్తారో చూడాలి. ఇటీవల మహేష్ - థమన్ కాంబినేషన్‌లో వచ్చిన సర్కారు వారి పాట మ్యూజికల్‌ హిట్‌గా  నిలిచింది. గతంలోనూ వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అలా హిట్ సాధించినవే. దాంతో ఈ కొత్త సినిమాపై మ్యూజిక్ పరంగా మంచి అంచనాలే ఉన్నాయి.


ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ బ్లాస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలవబోతున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. ఇక థమన్ చేతిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), శంకర్ (Shankar)- రామ్ చరణ్‌ Ram Charanల సినిమా, అఖిల్ (Akhil) నటిస్తున్న 'ఏజెంట్', రవితేజ, బాలకృష్ణ, నాగ చైతన్య, రాశీఖన్నాల 'థాంక్యూ', వంశీ పైడిపల్లి - విజయ్‌ల సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగులో మాత్రమే కాకుండా మరికొన్ని తమిళ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు థమన్.



Updated Date - 2022-07-09T17:40:42+05:30 IST