ఎన్టీఆర్ సినిమాని ఫాలో అవుతున్న SSMB 28 టీమ్

ABN , First Publish Date - 2022-06-22T04:13:20+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో.. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న మూడవ సినిమా కావడంతో..

ఎన్టీఆర్ సినిమాని ఫాలో అవుతున్న SSMB 28 టీమ్

SSMB 28: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో.. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న మూడవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీగా అంచనాలున్నాయి. మహేశ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలే దర్శకుడు త్రివిక్రమ్, మహేశ్‌కి ఫైనల్ నేరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కథ మొత్తం విన్న మహేశ్ బాబు ఓకే చేయడంతో, రెగ్యులర్ షూటింగ్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీ అయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ అంటూ ఓ వార్త బయటికి వచ్చింది. 


ఈ సినిమాలో మహేశ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. ఇప్పటివరకూ మహేశ్ చేసిన సినిమాల్లో డ్యూయల్ రోల్ ప్లే చేయలేదు, మాములుగా తెరపై ఒక మహేశ్ బాబు కనిపిస్తే ఫ్యాన్స్‌ని ఆపడం కష్టం. అలాంటిది ఇద్దరు మహేశ్ బాబులు ఒకేసారి తెరపై కనిపిస్తే, బాక్సాఫీస్‌కి బొమ్మ కనిపించడం ఖాయం. అంతే కాకుండా ఈ మూవీలోని సెకండ్ హాఫ్‌లో వచ్చే మహేశ్ పాత్ర సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని, ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం ఖాయమని టాక్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ని ‘అరవింద సమేత’ (Aravinda Sametha) తరహాలోనే, ఓ భారీ ఫైట్‌తో ప్రారంభించబోతున్నారని... దీనికి రామ్ లక్ష్మణ్ (Ram Laxman) నేతృత్వం వహించనున్నారని సమాచారం. 


ఈ ఫైట్ కోసం మాస్టర్స్, ఇప్పటికే భారీ స్కెచ్ కూడా సిద్దం చేశారట. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అరవింద సమేత సినిమా ఓపెనింగ్ కోసం కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్, ఎన్టీఆర్‌ (NTR)ని ఒక రేంజులో ఎలివేట్ చేసింది. టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌లో అరవింద సమేత ఒకటి. సరిగ్గా ఇదే రేంజులో మహేశ్‌తో చేస్తున్న సినిమాలో, హీరో ఇంట్రడక్షన్ ఉండేలా త్రివిక్రమ్, రామ్ లక్ష్మణ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే నెవర్ బిఫోర్ మాస్ మూలవిరాట్‌గా మహేశ్‌ని ప్రేక్షకులు చూడటం ఖాయం.

Updated Date - 2022-06-22T04:13:20+05:30 IST