SSMB 28: కొత్తగా ట్రై చేస్తున్న సూపర్ స్టార్..!

ABN , First Publish Date - 2022-08-16T17:04:42+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) న్యూ లుక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. మహేష్ తన ప్రతీ సినిమాకు సరికొత్త అవతారంలో కనిపించడానికి ట్రై చేస్తుంటారు.

SSMB 28: కొత్తగా ట్రై చేస్తున్న సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) న్యూ లుక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. మహేష్ తన ప్రతీ సినిమాకు సరికొత్త అవతారంలో కనిపించడానికి ట్రై చేస్తుంటారు. కథను బట్టి అందులోని పాత్రకు తగ్గట్టుగా ఆయన మోకోవర్ మారుతూ ఉంటుంది. ఇదే కాదు, ఫిజిక్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ఆయన తన 28వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏ హంగూ ఆర్భాటం లేకుండా మొదలై చాలా సైలెంట్‌గా జరుగుతోంది.


ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 28 (SSMB 28) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే (Pooja Hegdey హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు పర్‌ఫెక్ట్ బాడీతో కనిపించేందుకు బాగానే కసరత్తులు చేస్తున్నారు. దీనికోసం పాపులర్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ నేతృత్వంలో ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారట. తాజాగా దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట చల్‌చల్ చేస్తోంది. చిత్రీకరణ మొదలైన విషయం కూడా మహేష్ భార్య నమ్రత ద్వారా వెల్లడైంది.


ఇక, మహేష్ బాబు గతంలో నటించిన కొన్ని సినిమా కోసం జిమ్ లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీతోనూ దర్శనమిచ్చారు. మరి ఇప్పుడు తన 28వ సినిమా కోసం ఎలా కనిపించబోతున్నారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. కాగా, ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాను చేయనున్నారు. దీనికి కోసం రాజమౌళి ప్రస్తుతం కథా చర్చల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. 

Updated Date - 2022-08-16T17:04:42+05:30 IST