SSMB 28: కేజీఎఫ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారా..?

ABN , First Publish Date - 2022-08-24T17:46:13+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని యాక్షన్స్ సీక్వెన్స్ కేజీఎఫ్ సిరీస్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట.

SSMB 28: కేజీఎఫ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని యాక్షన్స్ సీక్వెన్స్ కేజీఎఫ్ సిరీస్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. మహేష్, త్రివిక్రమ్ కిలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ రెండు సినిమాలతో దర్శకుడు త్రివిక్రమ్..మహేష్‌కి హిట్స్ ఇవ్వలేకపోయారు. దాంతో ఈ సారి చేస్తున్న మూడవ సినిమా SSMB 28 తో భారీ హిట్ ఇవ్వాలని కసిగా ఉన్నారు.


అందుకే, ఈ మూవీకి సంబంధించిన ప్రతీదీ ఎంతో గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే యాక్షన్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే, యాక్షన్స్ సీన్స్ కంపోజ్ చేయడానికి కేజీఎఫ్ చిత్రాల ఫైట్ మాస్టర్స్ అన్‌బు (Anbu)- అరివు (Arivu)లను త్రివిక్రమ్ ఎంచుకున్నారు. వారు భారీ యాక్షన్ సీన్స్ ని  హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు మహేష్ సినిమాలో చూడని ఫైట్స్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్టు సమాచారం.


ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కెజీఎఫ్, కెజీఎఫ్ 2, విక్రమ్, లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సాలీడ్‌గా ఉండే యాక్షన్ సీక్వెన్స్ అందించిన అన్‌బు - అరివు..ఇప్పుడు మహేష్ సినిమాలో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారో చూడాలి.  

Updated Date - 2022-08-24T17:46:13+05:30 IST