GodFather: బాలయ్యకే కాదు.. చిరుకీ సెంటిమెంట్ వర్కవుటైంది

ABN , First Publish Date - 2022-10-07T21:45:43+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మోహన్ రాజా (Mohan Raja) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father). అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన

GodFather: బాలయ్యకే కాదు.. చిరుకీ సెంటిమెంట్ వర్కవుటైంది

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మోహన్ రాజా (Mohan Raja) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father). అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్‌తో చిత్రబృందం మొత్తం హ్యాపీగా ఉంది. ఇక ఈ సినిమాకి ప్రధాన హైలెట్స్‌లో ఒకటి సంగీతం. మెగాస్టార్ కోసం థమన్ ప్రాణం పెట్టేశాడు అనేలా టాక్ వినబడుతున్న నేపథ్యంలో.. థమన్ కూడా సోషల్ మీడియా వేదిగా తన సంతోషాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు, మీడియాతో కూడా ఈ సక్సెస్‌పై ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్‌గారి విషయంలో కూడా నా సెంటిమెంట్ వర్కవుట్ అయింది. ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నానంటూ.. థమన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


థమన్ మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. నాకు ఫస్ట్ హీరో హిట్ సెంటిమెంట్ వుంది. నేను తొలిసారి కలిసి పనిచేసిన హీరోలందరి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. మహేష్-దూకుడు (Mahesh Babu Dookudu), రవితేజ-కిక్ (Ravi Teja Kick), ఎన్టీఆర్-బృందావనం (NTR Brindavanam), పవన్ కళ్యాణ్-వకీల్ సాబ్ (Pawan Kalyan Vakeel Saab), బాలకృష్ణ-అఖండ (Balakrishna Akhanda)..  ఇలా అన్నీ బ్లాక్‌బస్టర్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగారితో నేను చేసిన తొలి సినిమా ‘గాడ్ ఫాదర్’ కూడా బ్లాక్ బస్టర్ కావడం సెంటిమెంట్ కొనసాగినట్లయింది. చిరంజీవిగారికి మ్యూజిక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆయనలో చాలా లేయర్స్ వుంటాయి. అవన్నీ అందుపుచ్చుకోవడం అంత ఈజీ కాదు. నేను, దర్శకుడు మోహన్ రాజా ఏడాది పాటు చాలా కష్టపడ్డాం. మ్యూజిక్‌కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్‌గా హై తీసుకురావడం ఒక పెద్ద సవాల్ తీసుకున్నాం. సినిమా చూసిన  ప్రేక్షకులు సంగీతం గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా వుంది. మా టీం అందరికీ చిరంజీవి గారంటే ఇష్టం. అందరూ ప్రాణం పెట్టి చేశారు. చిరంజీవి గారు ఒక మహా వృక్షం. ఆ వృక్షానికి నీరు పోయడం అంత తేలిక కాదు. ఎంతపోసిన ఇంకా అడుగుతూనే వుంటుంది. ఆయనకి సినిమా చేస్తున్నపుడు ఆయన గత సినిమాలతో కూడా పోలిక వస్తుంది. మణిశర్మ గారు,  కోటి గారు , కీరవాణి గారు .. ఇలా అందరూ చిరంజీవి గారి అద్భుతమైన మ్యూజిక్ చేశారు. మనం నెక్స్ట్ లెవల్ లో ఎలా చేయాలని అలోచిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకొని పని చేశాం. నేను చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్‌గా పని చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ అనేది సెకండరీ. మేమంతా మా బాస్ చిరంజీవిగారి కోసం పని చేశాం..’’ అని తన ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ని థమన్ షేర్ చేసుకున్నారు.

Updated Date - 2022-10-07T21:45:43+05:30 IST