RRR: ఆ రోజే బుల్లి తెర మీదకు వచ్చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’

ABN , First Publish Date - 2022-08-07T00:12:16+05:30 IST

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్

RRR: ఆ రోజే బుల్లి తెర మీదకు వచ్చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ‘నెట్‌ఫ్లిక్స్’, ‘జీ-5’, ‘డిస్నీ+హాట్‌‌స్టార్’ ఓటీటీ ప్లాట్‌ఫాంస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే టెలివిజన్‌లోకి కూడా రాబోతుంది. 


‘ఆర్ఆర్ఆర్’ ఆగస్టు 14న స్టార్ మాలో ప్రసారం కానుంది. హిందీ వెర్షన్ అదే రోజు జీ-సినిమాలో రాత్రి 8గంటలకు ప్రీమియర్ కానుందని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ మే 20నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ సినిమాను విదేశీ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. హాలీవుడ్ దర్శకులతో సహా సామాన్య ప్రేక్షకులు సైతం ఈ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫాంలో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డును సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో 10వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిన మొదటి నాన్ ఇంగ్లీష్ సినిమా‌గా రికార్డు సృష్టించింది. ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్, ‘డాక్టర్ స్ట్రేంజ్’ దర్శకుడు స్కాట్ డెరిక్సన్, స్క్రీన్ రైటర్ జాన్ స్పైహ్ట్స్ తదితరులు ఈ మూవీని ప్రశంసించారు.

Updated Date - 2022-08-07T00:12:16+05:30 IST