RRR: అరుదైన రికార్డు సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ ఘనత దక్కించుకున్న ఏకైక సినిమాగా ..

ABN , First Publish Date - 2022-08-25T23:51:45+05:30 IST

దర్శక ధీరడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా

RRR: అరుదైన రికార్డు సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ ఘనత దక్కించుకున్న ఏకైక సినిమాగా ..

దర్శక ధీరడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. రూ.1200కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ మే 20నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ సినిమాను విదేశీ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. హాలీవుడ్ దర్శకులతో సహా సామాన్య ప్రేక్షకులు సైతం ఈ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డును సృష్టించింది. 


నెట్‌ఫ్లిక్స్‌లో 14వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిన ఏకైక ఇంగ్లీష్, నాన్ ఇంగ్లీష్ సినిమా‌గా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు సృష్టించింది. ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ దర్శకులు రుస్సో బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్, ‘డాక్టర్ స్ట్రేంజ్’ దర్శకుడు స్కాట్ డెరిక్సన్, స్క్రీన్ రైటర్ జాన్ స్పైహ్ట్స్ తదితరులు ఈ మూవీని మెచ్చుకున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాపై తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్ తరఫున అధికారిక నామినేషన్‌గా ‘ఆర్ఆర్ఆర్’ ను ఆస్కార్‌కు పంపిస్తే.. ఆ అవార్డును గెలుచుకునే సత్తా ఈ మూవీకీ ఉందన్నారు.



Updated Date - 2022-08-25T23:51:45+05:30 IST