‘భీమ్లా నాయక్’: ఇక రాజమౌళినే రంగంలోకి దిగుతున్నాడా?

ABN , First Publish Date - 2021-11-24T02:05:18+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా

‘భీమ్లా నాయక్’: ఇక రాజమౌళినే రంగంలోకి దిగుతున్నాడా?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒక్క విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ భయపడుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆకాశమే హద్దుగా సినిమాపై అంచనాలుంటే.. చిత్రయూనిట్ ఎందుకు భయపడుతోంది? అనే అనుమానాలు రావడం సహజమే. అందులోనూ జక్కన్న దర్శకత్వం వహించిన చిత్రం.. మరెందుకు చిత్రయూనిట్ భయపడుతున్నట్లు? ఇవే అనుమానాలు అందరిలో ఉన్నాయి. అయితే ఈ భయానికి కారణం ఎవరో కాదు.. భీమ్ భీమ్.. ‘భీమ్లా నాయక్’. 


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్’ చిత్ర విడుదల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. కారణం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన 5 రోజులకే ‘భీమ్లా నాయక్’ చిత్రం విడుదలవుతుండటంతో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చిత్రయూనిట్ భావిస్తోంది. అందుకే ‘భీమ్లా నాయక్’ చిత్రయూనిట్‌తో ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వినవచ్చాయి. చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు సైతం.. పవన్ కల్యాణ్ సినిమాని పోస్ట్‌పోన్ చేయమని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత వంశీ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా.. రీసెంట్‌గా ట్విట్టర్‌లో కూడా ‘భీమ్లా నాయక్’ అప్డేట్ వదిలారు. దీంతో, స్వయంగా రాజమౌళినే రంగంలోకి దిగబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.


‘భీమ్లా నాయక్’ మేకర్స్‌తో పాటు పవన్ కల్యాణ్‌ని కూడా రాజమౌళి కలవబోతున్నాడని, ‘ఆర్ఆర్ఆర్’ పరిస్థితులను వివరించి.. సినిమాని వాయిదా వేయమని కోరబోతున్నాడనేలా తాజాగా టాలీవుడ్‌లో టాక్ మొదలైంది. వాస్తవానికి బాలీవుడ్‌లో సైతం ‘ఆర్ఆర్ఆర్’ కోసం కొన్ని చిత్రాలు విడుదల తేదీని మార్చుకున్నాయి. అలాగే టాలీవుడ్‌లో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కూడా వాయిదా పడింది. ఒక్క ‘భీమ్లా నాయక్’ బరిలో నుండి తప్పుకుంటే ‘ఆర్ఆర్ఆర్’కి ఇక తిరుగుండదు. అందుకే ‘భీమ్లా నాయక్’ని ఒప్పించేందుకు రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడట. మరి జక్కన్న మాటని ‘భీమ్లా నాయక్’ టీమ్ ఎంత వరకు గౌరవిస్తుందో చూడాలి.

Updated Date - 2021-11-24T02:05:18+05:30 IST